పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. మొత్తం 17 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా అందులో టీడీపీ 7 చోట్ల, వైసీపీ 6 చోట్ల, జనసేన 4 చోట్ల విజయం సాధించింది. ఎంపీపీ అధ్యక్షుడిగా ఎవర్ని ఎన్నుకోవాలి అన్నా జనసేన సపోర్ట్ అవసరం కావడంతో ఇప్పుడు ఆ పార్టీ ఎంపీటీసీలకు ఆకర్షించేందుకు క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. జనసేన పార్టీ ఎంపీటీసీలు కీలకం కావడంతో జనసేన ఆ పార్టీ ఎంపీటీసీలను రహస్యప్రాంతానికి తరలించింది. ఇటు టీడీపీ కూడా తమ ఏడుగురు ఎంపీటీసీలను రహస్యప్రాంతాలను తరలించింది. ఆచంట ఎంపీపీని దక్కించుకోవడానికి వైసీపీ మంత్రి రంగనాథరాజు, మాజీమంత్రి పితానీలు రంగంలోకి దిగారు. దీంతో ఆచంట రాజకీయం ఆసక్తికరంగా మారింది.
Read: ఆ దేశంలో యాంటీ వ్యాక్సిన్ రడగ: వందలాదిమంది అరెస్ట్…రెండు వారాలపాటు సీజ్…