Site icon NTV Telugu

National No Selfies Day: నేడు ‘నో సెల్ఫీస్‌ డే’ పాటిస్తున్నారా?

No Selfi Day

No Selfi Day

సాంకేతిక అభివృద్ధి కారణంగా ఫోటో క్యాప్చర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. డిజిటల్‌ యుగంలో ‘సెల్ఫీ’ పదం బాగా ప్రాచుర్యంలోకి పొందింది. స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నవారు సెల్ఫీలు తీసుకునే పరిస్థితి నెలకొంది. అందమైన ప్రదేశం కనిపిస్తే చాలు అక్కడ ఫోన్ లతో సెల్ఫీలకు రెడీ అయిపోతారు. సెల్ఫీ స్టిక్‌లు, ఫోన్‌ కెమెరాలోని ఆప్షన్లతో ఫొటోలు తీసుకోవడం ష్యాషన్ గా మారింది. ప్రపంచంలో రోజుకు ఒక మిలియన్ సెల్ఫీలు తీసుకునేవారు ఉంటారని ఒక అంచనా. ఈ సెల్ఫీల మోజులో చాలా మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. అలా సెల్ఫీలు తీసుకోవడం వ్యసనంలా మారిన కొందరు మాత్రం రోజంతా తమ కెమెరాలు, స్మార్ట్ ఫోన్ లను క్లిక్‌ మనిపిస్తూనే ఉంటారు. అయితే సెల్ఫీలు తీసుకునే వారు ఇవాళ(మార్చి 16) బ్రేక్ ఇచ్చారు.

Also Read: Angry Hippos: సింహంపై హిప్పో దాడి.. బెదిరిపోయిన అడవి రాజు.. ఏం జరిగిందంటే..

ప్రతి సంవత్సరం మార్చి 16ను ‘నో సెల్ఫీస్‌ డే’గా నిర్వహిస్తారు. సెల్ఫీలు తీసుకోవడం మీకు ఎంత ఇష్టమైనా ఇవాళ మాత్రం నో సెల్ఫీడేను పాటించాలని కొందరు నిర్ణయించారు. సెల్ఫీ తీసుకోవాలని ఉన్నప్పటికీ, మనలో ప్రతిరోజూ మన ఫోటో తీయాలనే ఆలోచనను ఇష్టపడని వారు మొత్తం 24 గంటల పాటు ఒక్కటి కూడా తీయకుండా ఉండటానికి ఒక రోజును అంకితం చేస్తారు. దీనినే ‘నో సెల్ఫీలు డే’గా నామకరణం చేశారు. సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసే యువత.. కనీసం ఒక్కరోజైనా సెల్ఫీలు తీసుకోకుండా ఉంటే బాగుంటుంది కదా. ఒక్క రోజు నేషనల్ నో సెల్ఫీస్ డే ని పాటించాలని కొందరు నిపుణులు కోరుతున్నారు.

Also Read: Kotamreddy Sridhar Reddy : సస్పెండ్ చేసినా.. సమస్యలను ప్రజా కోర్టులో ప్రస్తావిస్తూనే ఉంటా

Exit mobile version