ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలు సామాన్యులను అతలాకుతలం చేశాయి.. రాయలసీమ జిల్లాలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి.. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో వర్షాలు, వరదలతో కొందరు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు భారీగా నష్టపోయారు.. అయితే, బాధితులకు అండగా మేమున్నామంటూ.. పలువురు సినీ ప్రముఖులతో పాటు ట్రస్ట్‌లు కూడా ముందుకు వస్తున్నాయి.. ఇక, బాధితులకు మేమున్నామంటూ ముందుకు వచ్చింది ఎన్టీఆర్ ట్రస్ట్.. వరద బాధితులకు సాయం చేసేందుకు ఇవాళ తిరుపతిలో పర్యటించనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి.. తిరుపతిలో పర్యటించి వరదల్లో చనిపోయిన మృతుల కుటుంబాలను పరామర్శించనున్న ఆమె.. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు తరపున మృతుల కుటుంబాలకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. ఇక, ఇవాళ మొత్తం 48 మంది కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనుంది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్.