తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు నాగార్జున విన్నపం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సినిమా పరిశ్రమ కష్టాలను పట్టించుకోవాలంటూ ఇటీవల మెగాస్టార్ చిరంజీవి రిక్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా కింగ్ నాగార్జున కూడా వీరితో చేరిపోయారు. నిన్న జరిగిన “లవ్ స్టోరీ” సక్సెస్ మీట్ లో నాగ్ మాట్లాడారు. ఈ మూవీ కరోనా సెకండ్ వేవ్ తరువాత బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది. నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రలు పోషించిన ‘లవ్ స్టోరీ’ని శేఖర్ కమ్ముల రూపొందించారు. ఈ సినిమా సక్సెస్ మీట్‌ను మేకర్స్ నిన్న హైదరాబాద్‌లో నిర్వహించగా, ఈ కార్యక్రమానికి నాగార్జున అక్కినేని ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తన ప్రసంగంలో నాగార్జున బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా డ్రీమ్ రన్ గురించి మాట్లాడారు, చిత్ర తారాగణం, సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలోనే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేశారు. “తెలుగు వారికి తెలుగు సినిమా అంటే విపరీతమైన ప్రేమ. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఒకే ఒక విన్నపం. మమ్మల్ని ఆశీర్వదించమని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను అభ్యర్థిస్తున్నాను” అని నాగార్జున తన ప్రసంగాన్ని ముగించే ముందు చెప్పారు.
Also Read
- DGCA: డీజీసీఏ సంచలన నిర్ణయం.. ఇకపై పైలట్లందరికీ డ్రగ్ టెస్టులు
- Supreme Court: ‘చేపల్లా కుక్కేస్తున్నారు’.. ప్రైవేటు హాస్టళ్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
- Jinping: బ్రిక్స్ సదస్సుకు వస్తున్న జిన్‌పింగ్.. సోషల్ మీడియాలో చైనా పోస్ట్
- PM Modi: 2035లో భారత్ కల నెరవేరుతుంది.. 2040లో మాత్రం చంద్రుడిపై జరిగేది ఇదే!
Read Also : రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన సమంత
ఇంతకుముందు “లవ్ స్టోరీ” ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరికీ సినిమా పరిశ్రమ డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆయన తన అభిప్రాయాలను తెలిపి ప్రభుత్వాల నుండి మద్దతు కోరాడు. ఈ మధ్య పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఇబ్బందులు సృష్టిస్తోందని బహిరంగంగా విమర్శించారు. పవన్ తీరుపై కొంతమంది సినిమా పెద్దలే అసంతృప్తిని వ్యక్తం చేస్తుండడంతో ఈ విషయంపై ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది.
పలు సందర్భాల్లో తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతినిధులలో ఒకరైన నాగార్జున కూడా ప్రభుత్వానికి బహిరంగంగా అభ్యర్ధనలు చేస్తున్న ప్రచారంలో తన స్వరాన్ని వినిపించారు. అయితే నాగార్జున దానిని చిరంజీవి లాగా సుదీర్ఘంగా లేదా పవన్ కళ్యాణ్ లాగా విమర్శనాత్మకంగా చేయలేదు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో నాగార్జునకు మంచి సంబంధాలు ఉన్నాయని మొదటి నుండి ఒక చర్చ జరుగుతోంది. ప్రభుత్వానికి ఆయన చేసిన తాజా అభ్యర్థన చూస్తుంటే సినిమా సమస్యలను సాఫీగా పరిష్కారం అవ్వాలని ఆయన అనుకుంటున్నట్లు రుజువు అవుతోంది.
తాజావార్తలు
-
Trump Freebie Politics: ట్రంప్ ‘‘ఉచితాలు’’.. భారత ఎన్నికల నుంచి పాఠాలు.?
-
Uttar Pradesh: మసీదు కూల్చివేతపై అభ్యంతరం ఉంటే, పాక్, బంగ్లాదేశ్ వెళ్లిపోండి ఖర్చు మేమే భరిస్తాం..
-
DGCA: డీజీసీఏ సంచలన నిర్ణయం.. ఇకపై పైలట్లందరికీ డ్రగ్ టెస్టులు
-
BRICS: బ్రిక్స్ కోసం ఢిల్లీలో భారీ భద్రత.. యాంటీ-డ్రోన్ వ్యవస్థలు, భవనాలపై స్నైపర్లు
-
Supreme Court: ‘చేపల్లా కుక్కేస్తున్నారు’.. ప్రైవేటు హాస్టళ్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?