రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన సమంత

నాగ చైతన్య, సమంతలపై విడాకులపై గత కొన్ని రోజులుగా పుకార్లు వస్తున్న విషయం తెలిసిందే. ఈ పుకార్లపై ఇద్దరూ ఇంకా స్పందించలేదు. మరోవైపు సామ్, చై అభిమానులు ఈ విషయం గురించి గందరగోళంలో ఉన్నారు. ఇప్పటికే మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో ఈ జంట విడిపోవడంపై పలు కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సామ్ పుకార్లకు చెక్ పెట్టేసింది. తన దుస్తుల బ్రాండ్ ‘సాకి’ ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రశ్నోత్తరాల సెషన్‌ లో పాల్గొన్నారు. ఇందులో సామ్ ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఆ సమయంలోనే ఆమె అభిమాని ఒకరు “మీరు నిజంగా ముంబైకి వెళ్తున్నారా?” అని ప్రశ్నించారు.

Read Also : అదరహో అనిపించిన ఖుష్బూ!

అయితే తాను ఎక్కడికీ వెళ్లనని, హైదరాబాద్ తన ఇల్లు అని సమంత క్లారిటీ ఇచ్చింది. అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా సమంత “ఈ పుకారు ఎక్కడ మొదలైందో నాకు నిజంగా తెలియదు. కానీ అన్ని రూమర్స్ లాగే ఇది కూడా ఒక రూమర్. ఇందులో నిజం లేదు. హైదరాబాద్ నా ఇల్లు ఎప్పటికి. హైదరాబాద్ నాకు అన్నీ ఇస్తోంది, నేను ఇక్కడే ఉంటాను” అని చెప్పింది.

సమంత, నాగ చైతన్య విడిపోతారని ప్రముఖ ప్రముఖ జ్యోతిష్యుడు ఇటీవల జోస్యం చెప్పాడు. దీనివల్ల నాగ చైతన్య స్టార్‌డమ్‌కి ఎదుగుతాడని, సమంత పతనానికి గురవుతుందని చెప్పాడు. జ్యోతిష్యుడు కూడా సమంత ముంబైకి మారవచ్చని సూచించాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే విడాకుల గురించి అభిమానులు అడిగినప్పటికీ ఆమె వాటన్నింటినీ పట్టించుకోకుండా పరోక్షంగా “హండ్రెడ్ అదర్ రూమర్స్” అని చెప్పింది.

-Advertisement-రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన సమంత

Related Articles

Latest Articles