Mysterious Village : విశ్వంలో కొన్ని ప్రదేశాలు మన మానసిక శక్తికి దూరంగా, విచిత్రంగా ఉంటాయి. అలాంటి ఒక ఆసక్తికరమైన, భయానకమైన, అర్థంకాని విషయాలతో నిండిన ప్రదేశమే రష్యాలోని ఎం-ట్రయాంగిల్ అనే గ్రామం. రష్యాలోని ఉరాల్ పర్వతాల సమీపంలోని ఈ మోల్యోబ్‌కా అనే గ్రామం “పెర్మ్ ట్రయాంగిల్” లేదా “ఎం-ట్రయాంగిల్”గా ప్రసిద్ధి చెందింది.
ఇది మాస్కో నగరానికి దాదాపు 600 మైళ్ల దూరంలో ఉండే ఒక అజ్ఞాత ప్రాంతం. దీని విస్తీర్ణం 70 చ.మైళ్ల వరకు ఉంటుంది. 1980ల కాలంలో ఇక్కడి నుంచి విచిత్ర శబ్దాలు వినిపించడంతో ఇది ప్రపంచవ్యాప్తంగా శ్రద్ధ ఆకర్షించింది.
ఈ గ్రామంలో ఎలాంటి వాహనాలు లేకపోయినా రహదారి శబ్దాలు వినిపిస్తాయని స్థానికులు చెబుతున్నారు. సమీప రోడ్లు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నా ఇటువంటి శబ్దాలు ఎలా వస్తున్నాయన్నది ఇప్పటికి అర్థంకాలేదు. కొన్ని సందర్భాల్లో మొసపాటి కిరణాలు ఆకాశం నుండి భూమిపై పడతాయట. అంతేగాక, ఎవరో ఒక శక్తి అడవుల్లో సంచరిస్తున్నట్టు పలువురు కళ్లారా చూశారని చెబుతున్నారు.
Kollywood : ఆలస్యంగా మేల్కొన్న విలక్షణ నటుడు.. ఆ దర్శకుడితో వర్కౌట్ అవుతుందా.?
ఇక్కడ జరిగిన అత్యంత ఆశ్చర్యకర సంఘటనలలో ఒకటి—ఒక మానసిక రోగి అక్కడికి వెళ్లిన తర్వాత మానసికంగా స్థిరత సాధించి తిరిగి వచ్చాడట. మరొక వ్యక్తి తీవ్ర ఆరోగ్య సమస్యలతో అక్కడికి వెళ్లి, పూర్తి ఆరోగ్యంతో తిరిగొచ్చాడు. అందుకే ఈ ప్రాంతంలో దాగి ఉన్నది ఏదో శక్తి అని ప్రజలు విశ్వసిస్తున్నారు.
ఇక్కడ మొబైల్ కంపెనీల టవర్స్ ఉన్నా, ఫోన్లు పనిచేయవు. కానీ ఒకే ఒక మట్టిదిబ్బపై మాత్రమే ఫోన్ నెట్‌వర్క్ పనిచేస్తుంది. అక్కడ నిలబడి ప్రపంచంలో ఎక్కడికైనా కాల్ చేయొచ్చు. కానీ ఆ దిబ్బను వదిలి కిందకు దిగితే, నెట్‌వర్క్ పూర్తిగా కోల్పోతారు.
ఎం-ట్రయాంగిల్ వాస్తవమేనా? ఇది భౌతిక శాస్త్రానికి అతీతమైన ప్రాంతమా? లేక ఇది ఇతర లోకాలకు వంతెనలా పనిచేస్తుందా? ఇప్పటి వరకు దీనికి సమాధానం దొరకలేదు. అయితే అక్కడికి వెళ్లినవారి జీవితాల్లో జరిగే మార్పులు మాత్రం గమనించదగినవి.
CM Revanth Reddy : హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట.. గచ్చిబౌలి కేసు కొట్టేసిన న్యాయస్థానం
