అంబానీ అంటే గుర్తుకు వచ్చేది రిలయన్స్ గ్రూప్. రిలయన్స్ గ్రూప్ ఎన్ని వ్యాపారాలు చేసినా ఆయిల్ వ్యాపారంతోనే వారికి కలిసి వచ్చింది. ఆయిల్ రిఫైనరీస్‌తోపాటుగా రిలయన్స్ సంస్థ డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టిన తరువాత ఆదాయం మరింత పెంచుకుంది. 2015 వ సంవత్సరం నుంచి ప్రతి ఏడాది ఇండియాలో అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు. ఆరేళ్లపాటు ఆయన ప్రథమస్థానంలో నిలిచారు.
Read: 2013, ఫిబ్రవరి 15 నాటి ఘటన మళ్లీ జరిగితే…
అయితే, తాజా గణాంకాల ప్రకారం రిలయన్స్ అంబానీని అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ బీట్ చేశారు. ఇప్పటి వరకు రెండో స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ మొదటి స్థానాన్ని ఆక్రమించారు. నిన్నటి వరకు ముఖేష్ అంబానీ టాప్ లిస్ట్ లో ఉండగా, అంబానీకి, అదానీకి మధ్య తేడా చాలా స్వల్పంగా ఉన్నట్టు బ్లూంబర్గ్ ఇండెక్స్ తెలియజేసింది. కాగా, ఈరోజు అదానీ షేర్లు పుంజుకోవడంతో అదానీ దేశంలో అత్యంత ధనవంతుడిగా రికార్డ్ సాధించినట్లు బ్లూంబర్గ్ ఇండెక్స్ తెలియజేసింది.
