2013, ఫిబ్ర‌వ‌రి 15 నాటి ఘ‌ట‌న మ‌ళ్లీ జ‌రిగితే…

ఈ విశాల‌మైన విశ్వంలో భూమి ఒక్క‌టే కాదు… విశ్వంలో అనేక గ్ర‌హాలు, ఉప‌గ్ర‌హాలు, ఉల్క‌లు, గ్ర‌హ‌శ‌క‌లాలు ఉన్నాయి.  అవి విశ్వంలో ప్ర‌యాణం చేసే స‌మ‌యంలో ఒక్కోసారి భూమికి ద‌గ్గ‌ర‌గా వ‌చ్చి వెళ్తుంటాయి.  ఒక్కోమారు కొన్ని గ్ర‌హ‌శ‌క‌లాలు భూమిని ఢీకొడుతుంటాయి.  కొన్ని కోట్ల సంవ‌త్స‌రాల క్రితం ఆస్ట‌రాయిడ్స్ భూమిని ఢీకొన‌డం వ‌ల‌న భూమిపై రాక్ష‌స‌బ‌ల్లులు అంత‌రించిపోయాయి.  అయితే, ఇప్పుడు ఆధునిక టెక్నాల‌జీ అందుబాటులో ఉన్న‌ది.  అలాంటి ప్ర‌మాదాలు వ‌స్తే వాటిని ఎదుర్కొనేందుకు ప్ర‌పంచ‌దేశాలు సిద్ధంగా ఉన్నాయి.  అయితే, 2013, ఫిబ్ర‌వ‌రి 15 వ తేదీ  చ‌లికాలం స‌మ‌యం ఉద‌యం 9:20 గంట‌లు. చ‌లికి ర‌ష్యాలోని చ‌ల్‌యాబ్నిస్క్‌లో ప్ర‌జ‌లు పెద్ద‌గా బ‌య‌ట‌కు రాలేదు.  

Read: క్రిప్టో క‌రెన్సీతో సినిమా టికెట్లు కొనుగోలు చేయ‌వ‌చ్చ‌ట‌…


ఉన్న‌ట్టుండి ఆకాశంలో సూర్యుడికంటే వెలుగైన ఆస్ట్ర‌రాయిడ్‌ గోళాలు వేగంగా చ‌ల్‌యాబ్నిస్క్ వైపు దూసుకొచ్చాయి.  సుమారు 54 వేల కిలోమీట‌ర్ల వేగంతో దూసుకొచ్చి భూమిని భూమిని ఢీకొన‌డంతో ఆ న‌గ‌రంలోని ప్ర‌జ‌లు ఒక్క‌సారిగా భ‌య‌బ్రాంతుల‌కు గుర‌య్యారు.  వంద‌లాది ఇళ్లు దెబ్బ‌తిన్నాయి.  అయితే, ఆ గోళాలు నివాస ప్రాంతాల‌కు దూరంగా ప‌డ‌టంతో పెనుముప్పు త‌ప్పింది.  ఈ ఘ‌ట‌న‌లో సుమారు 1600 మందికి గాయాల‌య్యాయి.  అప్ప‌టి నుంచి చ‌ల్‌యాబ్నిస్క్ న‌గ‌ర ప్ర‌జ‌లు ఆకాశం నుంచి ఎలాంటి ఉల్క‌లు వ‌చ్చి ప‌డ‌తాయో అని భ‌య‌ప‌డుతున్నారు.  

Read: లైవ్‌: ట‌మోటా రేటే స‌ప‌రేటు…

కాగా, ఇలాంటివి భ‌విష్య‌త్తులో జ‌ర‌గ‌కుండా ఉండేందుకు నాసా ఓ ప్ర‌యోగం చేసింది.  భూమికి ముప్పును తీసుకొచ్చే ఆస్ట్ర‌రాయిడ్స్‌ను స్పేస్‌క్రాప్ట్‌తో ఢీకొట్టేందుకు డ‌బుల్ ఆస్ట్ర‌రాయిడ్ రీ డైరెక్ష‌న్ టెస్ట్ మిష‌న్ ను ప్ర‌యోగించింది.  ఈరోజు క్యాలిఫోర్నియాలోని స్పేస్ మిష‌న్ నుంచి డార్ట్‌ను లాంచ్ చేశారు.  ఎల‌న్ మ‌స్క్‌కు చెందిన ఫాల్క‌న్ 9 రాకెట్ ద్వారా ఈ డార్ట్ ప్ర‌యోగం జ‌రిగింది.  అంత‌రిక్షంలో భూమికి ముప్పుగా భావిస్తున్న డిడైమోస్‌, డైమోర్‌ఫోస్ అనే రెండు అస్ట్ర‌రాయిడ్‌ల‌ను నాశ‌నం చేయ‌డమే ఈ డార్ట్ ల‌క్ష్యం.  2022 చివ‌రి నాటికి లేదా 2023 మ‌ధ్య‌నాటికి డార్ట్ ల‌క్ష్యాన్ని చేధించే అవ‌కాశం ఉన్న‌ట్టు నాసా తెలియ‌జేసింది.  ఒక‌వేళ ల‌క్ష్యాన్ని డార్ట్ పూర్తిగా నాశ‌నం చేయ‌క‌పోయినా, దానిని దారిమ‌ళ్లించ‌డం వ‌ల‌న కూడా ముప్పునుంచి భూమిని ర‌క్షించ‌వ‌చ్చ‌ని నాసా చెబుతున్న‌ది.  

Related Articles

Latest Articles