Site icon NTV Telugu

హైద‌రాబాద్‌లో అందుబాటులోకి కోవిడ్ మాత్ర‌లు…

క‌రోనా మ‌హ‌మ్మారికి ఇప్ప‌టి వ‌ర‌కు వ్యాక్సిన్ అందిస్తూ వ‌స్తున్నారు.  అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికి రెండు డోసుల వ్యాక్సిన్ అందిస్తున్నారు.  ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న త‌రుణంలో ప్ర‌తి ఒక్క‌రూ వ్యాక్సిన్ తీసుకోవాల‌ని ప్ర‌భుత్వం సూచిస్తున్న సంగ‌తి తెలిసిందే.  ఇక ఇదిలా ఉంటే,  క‌రోనాను ఐదు రోజుల్లోనే క‌ట్ట‌డి చేయ‌గ‌ట సామ‌ర్థ్యం ఉంద‌ని చెబుతున్న మోల్నుపిరావిల్ ఇండియా యాంటీ వైర‌ల్ డ్ర‌గ్ కు డీసీజీఐ అనుమ‌తులు ఇచ్చింది.  ఇండియాలో ఈ మాత్ర‌లు త‌యారు చేయ‌డానికి 13 కంపెనీలు అనుమ‌తి తీసుకోగా ఇందులో 6 ఫార్మా కంపెనీలు హైద‌రాబాద్‌లోనే ఉన్నాయి.  

Read: రెండేళ్లుగా ఆ దేశంలో రాత్రి క‌ర్ఫ్యూ… ఎట్ట‌కేల‌కు ఎత్తివేత‌…

మోల్నుపిరావిర్ యాంటి వైర‌ల్ డ్ర‌గ్‌ను ఆప్టిమ‌స్ సంస్థ మోల్‌కోవిర్ పేరుతో ట్యాబ్లెట్ల‌ను త‌యారు చేసింది.  ప్ర‌స్తుతం ఇవి హైద‌రాబాద్ మార్కెట్లో అందుబాటులోకి వ‌చ్చాయి.  జ‌న‌వ‌రి 3 వ తేదీ నుంచి మిగ‌తా న‌గ‌రాల్లో కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్న‌ట్టు ఆప్టిమ‌స్ ఫార్మా తెలియ‌జేసింది. ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతున్న నేప‌థ్యంలో క‌రోనా క‌ట్ట‌డికి ట్యాబ్లెట్లు అందుబాటులోకి రావ‌డం విశేషం. 

Exit mobile version