NTV Telugu Site icon

IND vs PAK: పని చేయని పాకిస్తాన్ కెప్టెన్ ట్రిక్.. మంత్రాలు చేసినప్పటికీ ఓటమి

Mohammad Rizwan

Mohammad Rizwan

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా.. దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ప్రదర్శన, వ్యూహం రెండింటిలోనూ విఫలమైంది. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ ఐడియాలు పని చేయలేదు. కాగా.. పాకిస్తాన్ కెప్టెన్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రిజ్వాన్ మ్యాచ్ సమయంలో ‘తస్బీహ్’ ప్రార్థన పూసలు పట్టుకుని కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రార్థనా పూసలతో అదృష్టం మారాలని ప్రార్థిస్తూ కనిపించాడు. అయినప్పటికీ పాక్ ఓటమి పాలైంది. సాధారణంగా తస్బీహ్ ముస్లిం మత గురువుల చేతుల్లో కనిపిస్తుంది.

Read Also: Hari Hara Veera Mallu: ‘కొల్లగొట్టినాదిరో’ అంటున్న ‘హరి హర వీరమల్లు’!

భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఓపెనర్లుగా బాబర్ అజామ్, ఇమామ్ ఉల్ హక్ క్రీజులోకి వచ్చారు. వారిద్దరూ ఆడుతున్న సమయంలో పాకిస్తానీ డ్రెస్సింగ్ రూమ్ దృశ్యం టీవీలో కనిపించింది. ఈ సమయంలో కామెంట్రీ చేస్తున్న ఆకాష్ చోప్రా.. రిజ్వాన్ ఏదైనా మంత్రాలు చేస్తున్నాడా అని అన్నాడు. అతని చేతుల్లో ఏముంది..? అని అన్నాడు. దీంతో.. ఆకాశ్ పక్కన ఉన్న పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ వహాబ్ రియాజ్ స్పందిస్తూ.. అది ప్రార్థన పూసలు అని చెప్పాడు. దాని మతపరమైన ప్రాముఖ్యత గురించి వివరించాడు.

Read Also: Kayadu Lohar : అప్పుడు దేఖలేదు.. ఇప్పుడేమో క్రష్ అంటున్నారు!

మొహమ్మద్ రిజ్వాన్ స్టేడియంలో తప్రార్థన పూసలు పట్టుకుని కనిపించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా కొన్ని మ్యాచ్‌లలో ఇలా చేశాడు. అంతేకాకుండా.. రిజ్వాన్ మ్యాచ్ బ్రేక్ టైంలో స్టేడియంలో నమాజ్ చేసిన వీడియోలు కూడా బయటపడ్డాయి. ఇదే గాక.. తోటి ఆటగాళ్లకు ఖురాన్ కాపీలు ఇచ్చాడని చెబుతున్న మరో వీడియో బయటపడింది. దీనిపై కొంతమంది పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు రిజ్వాన్‌ను విమర్శించారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఐదవ మ్యాచ్‌లో భారత్ పాకిస్తాన్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. పాక్ ఈ ఓటమితో టోర్నమెంట్‌ నుంచి దాదాపుగా నిష్క్రమించినట్లే.