NTV Telugu Site icon

Indian climber rescued: అన్నపూర్ణ పర్వతంపై క్షేమంగా భారతీయ పర్వతారోహకుడు

Indian Climber

Indian Climber

అన్నపూర్ణ పర్వతంపై తప్పిపోయిన భారతీయ పర్వతారోహకుడు 34 ఏళ్ల అనురాగ్ మాలూను క్షేమంగా ఉన్నాడు. అనురాగ్ ను సజీవంగా రక్షించారు. ప్రపంచంలోని 10వ ఎత్తైన శిఖరం క్యాంప్ III దిగువన ఉన్న పగుళ్లలో అనురాగ్ ను కనుగొన్నట్లు సెవెన్ సమ్మిట్ ట్రెక్స్‌కు చెందిన థానేశ్వర్ గురాగైన్ తెలిపారు. కానీ మాలూ ఆరోగ్యం విషమంగా ఉంది మరియు ప్రస్తుతం పోఖారాలోని మణిపాల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని గురాగైన్ తెలిపారు.

క్యాంప్ II నుండి దిగుతుండగా 5,800 మీటర్ల నుండి పగుళ్లలో పడిపోయిన అనురాగ్ సోమవారం కనిపించకుండా పోయాడు. చాంగ్ దావా నేతృత్వంలోని ఆరుగురు షెర్పా అధిరోహకుల బృందం అనురాగ్ కోసం గాలించారు. బుధవారం 300 మీటర్ల లోతైన పగుళ్లలో అతన్ని కనుగొని, విమానంలో పోఖారాకు తరలించారు. అనురాగ్‌ని కలిసిన తర్వాత అతని సోదరుడు సుధీర్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. అనురాగ్ కుటుంబ సభ్యులు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కి లేఖ రాశారు. అధిరోహకుడు క్షేమంగా తిరిగి రావడానికి జోక్యం చేసుకోవాలని కోరారు. కాగా, ఇంతకుముందు, మరో ప్రఖ్యాత భారతీయ పర్వతారోహకురాలు బల్జీత్ కౌర్ కూడా ఇదే పర్వతంలో కనిపించకుండా పోయింది, అయితే రెస్క్యూ టీమ్ ఆమెను గుర్తించింది.