NTV Telugu Site icon

భారీ పెట్టుబడులతో విద్యుత్ సంస్థల విస్తరణ

తెలంగాణలో రాబోయే రోజుల్లో విద్యుత్ సంస్థల్ని పటిష్టం చేయనున్నారు. జెన్కో ఆద్వర్యంలో పదివేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో 57 లక్షలకు పెరిగాయి నూతన కనెక్షన్లు. వీటితో పాటు వ్యవసాయరంగంలో 19 నుంచి 26 లక్షలకు పెరిగిన వ్యవసాయ మోటార్ కనెక్షన్లు పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గత ఏడేళ్లలో 7778 మెగావాట్ల నుండి 16,6 23 మెగావాట్లకు విద్యుత్ ఉత్పత్తి పెరిగింది. 26,915 కిలోమీటర్ల EHT విద్యుత్ లైన్లు ఏర్పాటయ్యాయని అధికారులు తెలిపారు. రెండు లక్షల కిలో మీటర్ల పైగా పెరిగాయి విద్యుత్ లైన్లు. కొత్తగా 1000 33/11 కెవి సబ్ స్టేషన్లు ఏర్పాటు అయ్యాయి. వీటికి తోడు అదనంగా 2వేల పవర్ ట్రాన్స్ ఫార్మర్స్ ఏర్పాటుచేశామని మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి చెప్పారు. మూడు లక్షల కొత్త డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ అందుబాటులోకి తెచ్చామన్నారు. 168 లక్షల వినియోగదారులకు విద్యుత్ సరఫరా అవుతోందన్నారు. హైదరాబాద్‌ బీఆర్కె భవన్ లో విద్యుత్ ఆర్థిక స్థితిగతులపై సమీక్ష నిర్వహించారు ఆర్థిక మంత్రి హరీశ్ రావు, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి.