NTV Telugu Site icon

ఏపీ బీజేపీపై మంత్రి పేర్ని నాని ఫైర్‌..

ఏపీ బీజేపీపై మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, చంద్రబాబు ఎజెండానే బీజేపీ ఎజెండా అని ఆయన ఆరోపించారు. బీజేపీ నాయకులు ఏపీలో బ్రాందీ ధరలు పెరిగినందుకు బాధపడుతున్నారని, వారు బాధపడాల్సింది డిజీల్‌, పెట్రోల్‌ ధరలు పెరిగినందుకు అని ఆయన మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకముందు పెట్రోల్‌, డిజీల్‌ ధరలు ఇప్పటి ధరలు పరిశీలించాలన్నారు.

అంతేకాకుండా సుజనా చౌదరి, సీఎం రమేష్‌లకు బీజేపీ పార్టీని లీజుకు ఇచ్చారని, పార్టీ పాలసీలను నిర్ణయించేది సుజనా చౌదరి, సీఎం రమేశ్‌లు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అమిషా పరిధిలోని అంశాలను సుజనా చౌదరి ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు. బీజేపీ నేతలు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై ఎందుకు మాట్లాడటం లేదని ఆయన అన్నారు.