సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కు ఏపీ మంత్రి పేర్ని నాని రివర్స్ కౌంటర్ ఇచ్చారు. సాయితేజ్ ప్రమాదంలో మీడియాను పవన్ తప్పుపట్టడం సరైంది కాదన్నారు. తెలంగాణ పోలీసులు స్టేట్మెంట్ ఆధారంగానే మీడియా చెప్పిందని, మీడియాపై పవన్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడం కరెక్ట్ కాదన్నారు. పవన్ తిట్టాల్సి వైసీపీని కాదని, దమ్ముంటే కేసీఆర్ ని, తెలంగాణ పోలీసులను తిట్టాలన్నారు. సాయితేజ్ యువనటుడు, చాలా మంచివాడని త్వరగా కోలుకోవాలని వైసీపీ పార్టీ, సీఎం జగన్ మోహన్ రెడ్డి అంతా కోరుకున్నాం వాళ్లమని మంత్రి పేర్ని నాని తెలిపారు. కోడికత్తి కేసు ఎన్ఐఏ చూస్తోందని.. దమ్ముంటే అమిత్ షా నిలదీయండి అంటూ మంత్రి నాని ఫైర్ అయ్యారు. మీ రెమ్యూనరేషన్ లో కూడా ఎందుకు టాక్స్‌లు, జిఎస్టీలు కట్టాలని మోడీని ప్రశ్నించాలంటూ మంత్రి పేర్ని నాని సూచించారు. ఆ పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కోడికత్తి కేసు గూర్చి అమిత్ షాను నిలదీయండి: మంత్రి పేర్నినాని
