Site icon NTV Telugu

అందరికీ సర్కార్‌ నౌకరి రాదు.. హమాలీ పని ఉపాధి కాదా..?

Niranjan Reddy

Niranjan Reddy

టీఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 1.30 లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని చెబుతున్న పాలకులు.. మరో 50 వేల ఉద్యోగాల భర్తీకి కసరత్తు చేస్తున్నట్టు చెబుతున్నారు.. అయితే, ఈ తరుణంలో సర్కార్‌ కొలువులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి… నాగర్‌కర్నూల్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. చదువుకున్న అందరికీ సర్కారు నౌకరి రాదని వ్యాఖ్యానించారు.. అంతేకాదు, కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీ పని ఉపాధి కాదా..? అంటూ ప్రశ్నించారు.. హమాలీ పనికంటే మించిన ఉపాధి ఏముంది తెలంగాణలో అంటూ ఆయన వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. కాగా, కొత్త జోన్లు, కొత్త జిల్లాల ప్రతిపాదికన ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.. రెండు రోజుల కేబినెట్‌ సమావేశం నిర్వహించి.. దీనిపై ఫోకస్‌ పెట్టారు సీఎం కేసీఆర్‌.. ఈ తరుణంలో మంత్రి నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యలు చర్చగా మారాయి.

Exit mobile version