Site icon NTV Telugu

మిర్చి రైతుల్ని ఆదుకుంటాం.. కన్నబాబు

గుంటూరు జిల్లాలో మంత్రులు కన్నబాబు, మేకతోటి సుచరిత పర్యటించారు. ప్రత్తిపాడు మండలం కొండెపాడులో నల్లతామర పురుగుతో దెబ్బతిన్న మిర్చి పొలాలను పరిశీలించారు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, హోంమంత్రి సుచరిత. మిరప తోటలను పరిశీలించాం. ఏదో ఒక సమస్య రైతులను పీడిస్తోంది. గుంటూరు జిల్లాలోనే లక్షా ఆరు వేల హెక్టార్లలో మిర్చి సాగవుతుంది.

తామర పురుగు ఇతర దేశాల నుండి వచ్చి మన మిరపపై దాడి చేసింది.దీనికి సంబంధించి మన శాస్త్రవేత్తలు నివేదిక ఇచ్చారన్నారు మంత్రి కన్నబాబు. సిఎం ఆదేశాలతో పంటల పరిశీలనకు వచ్చామన్నారు. నష్టాల నుండి ఏవిధంగా బయట పడాలి అన్న ఆలోచన చేయాలి. ఉన్నత స్థాయి అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తాం.ఇతర పంటలపై కూడా తామరపురుగు వ్యాపిస్తుందని రైతులు చెబుతున్నారు. రైతులు, కౌలు రైతుల్ని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. రైతాంగానికి ఏ విధంగా సాయం చేయాలన్న దానిపై చర్యలు తీసుకుంటాం.అధిక వర్షాలతో నష్టపోయిన పంట పొలాలను ఎన్యూమరేషన్ పూర్తయిందన్నారు.

మిర్చి రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు హోంమంత్రి సుచరిత. గుంటూరు జిల్లాలో అధిక విస్తీర్ణంలో మిర్చి సాగు చేశారు. తెగుళ్ళ బారిన పడిన పంట పీకేస్తున్నారు. రైతులు ఎకరానికి లక్ష రూపాయలు నష్ట పోయారు. మూడు విధాలుగా నష్టపోయామంటున్నారు. నకిలీ విత్తనాలు, అధిక వర్షాలు, తామర పురుగుతో రైతులు నష్టపోయారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సిఎం దృష్టికి తీసుకెళ్తాం.నకిలీ విత్తనాలతో నష్టపోయిన వారికి ఎకరానికి ముప్పై వేల నష్టపరిహారం అందించాం.తెగుళ్ళతో జరిగిన నష్టానికి ఏవిధంగా ఆదుకోవాలి అన్న అంశంపై చర్చిస్తాం అన్నారు హోంమంత్రి మేకతోటి సుచరిత.

Exit mobile version