ఆంధ్రప్రదేశ్‌లో కేబినెట్‌లో భారీ మార్పులు ఉంటాయనే ప్రచారం గత కొంతకాలంగా సాగుతూనే ఉంది.. అయితే, ఆ వ్యాఖ్యలకు బరింత బలాన్ని ఇచ్చేలా సంచలన వ్యాఖ్యలు చేవారు మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి… ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆయన మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మంత్రివర్గంలో త్వరలో భారీ మార్పులు ఉంటాయని తెలిపారు. మంత్రి వర్గంలో వందశాతం కొత్తవారినే తీసుకుంటారని సీఎం వైఎస్ జగన్ చెప్పారని తెలిపిన ఆయన.. విధాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని సీఎం జగన్‌కు చెప్పానని పేర్కొన్నారు.. ఇక, తన మంత్రి పదవి పోయినా భయపడేది లేదు.. నాకు పార్టీ ముఖ్యం.. కానీ, పదవులు ముఖ్యం కాదని స్పష్టం చేశారు మంత్రి బాలినేని. ఓవైపు కేబినెట్ విస్తరణ, భారీ మార్పులపై గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న సమయంలో.. మంత్రి బాలినేని చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.. వందశాతం కొత్తవారికే అవకాశం అంటే.. ప్రస్తుతం కేబినెట్‌లో ఉన్న ఏ ఒక్క మంత్రి పోస్టుకు గ్యారంటీ లేదనే చర్చ మొదలైంది.. ఇక, కేబినెట్‌లో బెర్త్ కోసం కొందరు ఆశావాహులు ఎదురుచూస్తుంటే.. ఇప్పటికే కేబినెట్‌లో ఉన్నవారికి టెన్షన్ మొదలైంది.
ఏపీ కేబినెట్‌లో భారీ మార్పులు.. వందశాతం కొత్తవారికే అవకాశం..!
