Site icon NTV Telugu

ఉద్యోగులు సంతృప్తికరంగా ఉన్నారు : మంత్రి అప్పలరాజు

పీఆర్సీపై ఏపీలో ఇంకా స్పష్టత నెలకొనలేదు. ఇటీవలే సీఎం జగన్‌ పీఆర్సీని ప్రకటించారు. అయితే పీఆర్సీపై ఉద్యోగులకు ఆమోదయోగ్యంగా లేదని, సమ్మెకు వెళ్తామని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. ఈ సందర్బంగా మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. పీఆర్సీపై కొన్ని ఉద్యోగ సంఘాలు పాజిటివ్‌గా, కొన్ని వ్యతిరేకంగా మాటాడుతున్నాయని ఆయన అన్నారు. ఉద్యోగులు సంతృప్తికరంగా, ఆనందంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. ఎక్కడొ కొన్ని సంఘాలు ఎవరో కొంతమంది వెనుకనుండి ప్రోద్బలం వలన సమ్మెకు వెళ్తామనడం ఆలోచించాల్సిన విషయమన్నారు. హెచ్‌ఆర్‌సీ విషయంలో కూడా ఇంకా చర్చలు జరుగుతున్నాయని, ఐఆర్, ఫిట్‌మెంట్‌ విషయంలో రాంగ్ కాలిక్యులేషన్ చేస్తున్నారని ఆయన తెలిపారు.

ప్రతి ఉద్యోగికి కూడా జీతం పెరుగుతుందని ఆయన వెల్లడించారు. కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టిస్తున్నారని, ఉద్యోగులు ఆలోచించాలన్నారు. వాలంటీర్ వ్యవస్థను విమర్శించిన చంద్రబాబే నిన్న కుప్పంలో ప్రతి వందకుటుంబాలకు ఒక వాలంటీర్‌ అని ప్రకటించారని, జగన్‌ బోమ్మపెట్టుకొని ప్రచారం చేసుకోనే పరిస్థితికి చంద్రబాబుకు వస్తారన్నారు. అమ్మ ఒడి, విద్యాదీవెన, రైతుభరోసా వంటి పథకాలను ఎవరూ తీయలేరన్నారు. ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర ఉన్నంత వరకూ ఈ పథకాలు ఉండిపోతాయన్నారు. నాయకుడంటే దారిపొడవునా నడిచేవాడు కాదు. బాటలు వేసేవాడు, దారి చూపేవాడు. సచివాలయ వ్యవస్ధ , వాలంటీర్ దేశానికి ఆదర్శమని ఆయన అన్నారు.

Exit mobile version