NTV Telugu Site icon

సిద్దిపేటలో హైడ్రామా.. చిచ్చురేపిన కేసీఆర్ విగ్రహం

పిద్దిపేట పట్టణంలో ఆదివారం అర్థరాత్రి హై డ్రామా నడిచింది. పట్టణంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు నాయకులులాల్ కమాన్ పైన కెసిఆర్ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఈ విగ్రహం ఏర్పాటును నిరసిస్తూ, అది అక్కడ నుండి తొలగించాలంటూ బీజేపీ, కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో అర్ధరాత్రి ధర్నా నిర్వహించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి విగ్రహాన్ని తొలగించారు. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో వెనుతిరిగారు బీజేపీ కాంగ్రెస్ నాయకులు. అర్థరాత్రి హైడ్రామాపై స్థానికులు ఏం జరుగుతుందో తెలీక అయోమయానికి గురయ్యారు.