Site icon NTV Telugu

వైర‌ల్‌: ధ‌ర ఎంత పెరిగినా… ఇలా చేస్తే ట‌మోటా త‌రిగిపోదు…

ట‌మోటా ధ‌ర‌లు భారీగా పెరుగుతున్న సంగ‌తి తెలిసిందే.  ధ‌ర‌లు ఒక్క‌సారిగా పెర‌గ‌డంతో వినియోగదార‌లు బెంబేలెత్తున్నారు.  గ‌తంలో కేజీ 30 నుంచి 40 వ‌ర‌కు ఉండ‌గా ఇప్పుడు కేజీ ట‌మోటా వంద మార్క్ దాటిపోయింది.  ఇంకా పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్టు మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు వంద దాట‌టంతో నెటిజన్లు మీమ్స్ తో సోష‌ల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు.  కాగా, ఇప్పుడు ట‌మోటా ధ‌ర‌లు పెట్రోల్ ధ‌ర‌ల‌ను మించిపోవ‌డంతో త‌మ తెలివికి ప‌దునుపెట్టి మీమ్స్ త‌యారు చేస్తున్నారు.  కొంత‌మంది ఫ‌న్నీ వీడియోలు చేసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.  ఇలాంటి వాటిల్లో ఇది కూడా ఒక‌టిగా చెప్ప‌వ‌చ్చు.  ట‌మోటాల‌కు తీగ చుట్టి కాగుతున్న ర‌సంలో ముంచి తీసి, ఆ త‌రువాత రెండు ట‌మోటాల‌ను ఐస్ బాక్స్‌లో పెట్టేశారు. దీనికి సంబంధించిన చిన్న వీడియో ప్ర‌స్తుతం టిక్‌టాక్‌లో వైర‌ల్ అవుతున్న‌ది.  

Read: వేధిస్తున్న చిప్స్ కొర‌త‌… దూకుడు పెంచిన శాంసంగ్‌..

https://twitter.com/i/status/1463791157197037568
Exit mobile version