Site icon NTV Telugu

మెగాస్టార్ విత్ మెగా ఫ్యాన్ వెంకీ కుడుముల…!

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాకు సంబంధించిన అధికార ప్రకటన వచ్చేసింది. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య, యువ దర్శకుడు వెంకీ కుడుమలతో మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమాను నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. చిరంజీవికి మెగా ఫ్యాన్ అయిన వెంకీ కుడుమల ఈ అవకాశం లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. దానిని సరదాగా ఓ చిన్న వీడియో రూపంలో డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ ట్వీట్ చేసింది. ‘ఇలాంటి అవకాశం జీవితంలో ఒకేసారి వస్తుందని, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి పూర్తి స్థాయిలో తన శక్తిసామర్థ్యాలను ఉపయోగిస్తాన’ని వెంకీ కుడుముల తెలిపాడు. వెంకీ కుడుములకు ఈ అవకాశం దక్కడం పట్ల తోటి దర్శకులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఈ సినిమాను డాక్టర్ మాధవీ రాజుతో కలిసి డీవీవీ దానయ్య నిర్మించబోతున్నారు.

Exit mobile version