Site icon NTV Telugu

బిగ్ బ్రేకింగ్: సాయిధరమ్ తేజ్ కి రోడ్డు ప్రమాదం..

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కి రోడ్డు ప్రమాదానికి గురైయ్యాడు.. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ – 45 కేబుల్ బ్రిడ్జ్ మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. స్పోర్ట్స్ బైక్ నుంచి ఆయన కిందపడ్డారు.. తీవ్రగాయాలు కావడంతో సాయి ధరమ్ తేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. కేబుల్ బ్రిడ్జి దాటాక కోహినూర్ హోటల్ సాయి ధరమ్ తేజ్ స్పోర్ట్స్ బైక్ నుంచి ఒక్కసారిగా కిందపడ్డారు. అనంతరం స్థానికులు, పోలీసులు ఆయనను మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే సాయితేజ్‌ అపస్మారక స్థితిలో వెళ్లినట్లు తెలుస్తోంది. బైక్ ను నియంత్రించలేక అదుపుతప్పి కిందపడిపోయినట్లు తెలుస్తోంది. ఆయన కుడికన్ను, ఛాతి, పొట్ట భాగంలో తీవ్ర గాయాలైయ్యాయి.

Exit mobile version