NTV Telugu Site icon

ఏడు గంట‌ల్లో 7 బిలియ‌న్ డాల‌ర్ల న‌ష్టం…

సోమ‌వారం రాత్రి 9 గంట‌ల నుంచి మంగ‌ళ‌వారం ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు ఫేస్‌బుక్ డౌన్ అయింది.  ప‌లు స‌మ‌స్య‌ల కార‌ణంగా ఫేస్ బుక్ ఓపెన్ కాలేదు.  ఫేస్‌బుక్‌తో పాటుగా దాని అనుబంధ సంస్థ‌లైన ఇన్‌స్టాగ్రామ్‌, వాట్స‌ప్‌లు కూడా ఓపెన్ కాలేదు. దీంతో ప్ర‌పంచం మొత్తం షాక్ అయింది.  ఎందుకు ఇలా జ‌రిగిందో తెలియ‌న తిక‌మ‌క‌ప‌డ్డారు.  చాలామంది ట్విట్ట‌ర్‌లో పోస్టులు, మీమ్స్ పెట్టారు. అయితే, ఈరోజు ఉద‌యం 4 గంట‌ల స‌మ‌యంలో తిరిగి రిస్టోర్ అయింది.   దాదాపుగా ఏడు గంట‌ల‌పాటు సోష‌ల్ మీడియా స్థంభించిపోవ‌డంతో ఫేస్‌బుక్ అధినేత జూక‌ర్ బ‌ర్గ్‌కు 7 బిలియ‌న్ డాల‌ర్ల న‌ష్టం వ‌చ్చిన‌ట్టు నిపుణులు చెబుతున్నారు.  ఫేస్‌బుక్ షేర్లు ప‌డిపోవ‌డంతో 7 బిలియ‌న్ల మేర ఆస్తులు న‌ష్ట‌పోయిన‌ట్టు నిపుణులు చెబుతున్నారు.  ఫేస్‌బుక్ డౌన్ కావ‌డం ప‌ట్ల యూజ‌ర్ల‌కు క్షమాప‌ణ‌లు తెలిపారు.  

Read: యూపీలో కొనసాగుతున్న ప్రియాంక గాంధీ దీక్ష‌…