NTV Telugu Site icon

దీపావళి వేడుకల్లో అపశృతి.. పలువురికి గాయాలు

ఎంతో ఆనందంగా టపాసులు కాల్చి సంబరాలు చేసుకొనే దీపావళి పండుగ రోజు అపశృతి చోటు చేసుకుంది. మెహదీపట్నంలో దీపావళి వేడుకలు మొదలై టపాసులు కాలుస్తుండగా ప్రమాదవశాత్తు పలువురి కంటికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని మెహదీపట్నం సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి తరలించారు.

దీపావళి సందర్బంగా టపాసులు కాలుస్తుండగా ఏడుగురు గాయాలయ్యాయని.. వారిలో ఐదుగురికి ప్రథమ చికిత్స చేసి అనంతరం ఇంటికి పంపించినట్లు సరోజినీ దేవి కంటి ఆసుపత్రి ఆర్ఎంవో నాజాఫి బేగం తెలిపారు. మరో ఇద్దరిని మాత్రం 24 గంటల అబ్జర్వేషన్ అనంతరం పరిస్థితి చెప్తామని ఆర్‌ఎంవో వెల్లడించారు. దీపావళి వేడుకల్లో పత్రి ఒక్కరూ జాగ్రత్త వహించాలని ఆర్‌ఎంవో సూచించారు.