Site icon NTV Telugu

Pushpa : సునీల్ ”మంగ‌ళం శ్రీను” లుక్ వచ్చేసింది

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ప్యాన్‌ ఇండియా మూవీ గా తెరకెక్కుతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు, పోస్టర్లు మరియు టీజర్లకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్‌ ను వదిలింది చిత్ర బృందం. తాజాగా ఈ సినిమాలో సునీల్‌ పాత్రకు సంబంధించిన అప్ డేట్‌ ను చిత్ర యూనిట్‌ రివీల్‌ చేసింది.

సునీల్‌ ఈ చిత్రంలో మంగళం శ్రీను పాత్రలో నటిస్తుండగా…దానికి సంబంధించిన పోస్టర్‌ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇక ఈ పోస్టర్‌ లో సునీల్‌… చాలా భయంకరంగా కనిపిస్తున్నాడు. సీరియస్‌ గా ఫోన్‌ లో మాట్లాడుతున్న సునీల్‌ లుక్‌ అదిరిపోయింది. ఇక ఈ పోస్టర్‌ చూస్తుంటే.. ఈ సినిమాలో సునీల్‌ విలన్‌ పాత్రలో కనిపిస్తున్నాడా ? అనే ప్రశ్న తలెత్తుతోంది. కాగా… పుష్ప పార్ట్‌ 1 డిసెంబర్‌ 17 న విడుదలకానుంది.

Exit mobile version