NTV Telugu Site icon

Bengaluru: ప్రియుడితో పుట్టినరోజు వేడుకులు.. రాత్రికి ప్రియురాలి హత్య

Bengaluru Murder

Bengaluru Murder

బెంగళూరులో తన ప్రియుడితో పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న ఓ యువతి.. రాత్రికి హత్యకు గురయింది. ప్రియురాలి హత్య చేసిన ఆరోపణలపై కర్ణాటక పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. మృతి చెందిన యువతి 24 ఏళ్ల నవ్యగా గుర్తించారు. ఆమె రాష్ట్ర పోలీసు శాఖలోని అంతర్గత భద్రతా విభాగంలో క్లర్క్‌గా పనిచేశారు. నిందితుడిని కనకపురానికి చెందిన ప్రశాంత్‌గా గుర్తించారు.
Also Read:Arvind Kejriwal: ప్రధానికి వెయ్యి కోట్లు ఇచ్చా.. అరెస్టు చేస్తారా?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రశాంత్‌తో నవ్య ఆరేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉంది. ఇద్దరూ దూరపు బంధువులు. నవ్య గత మంగళవారం తన పుట్టినరోజును జరుపుకుంది. అయితే తాను బిజీగా ఉన్నానని పేర్కొంటూ ప్రశాంత్ దానికి హాజరు కాలేదు. అనంతరం నిందితుడు శుక్రవారం రాత్రి ఆమె పుట్టినరోజు వేడుకను గ్రాండ్ నిర్వహించాడు. ఓ కేక్ కొని నవ్య చేత కట్ చేయించాడు. అనంతరం ఆమె గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నవ్య మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. నవ్య మరో వ్యక్తితో చాటింగ్ చేయడంతో ఆమెపై ప్రశాంత్ కు అనుమానాలు పెరిగాయి. ఈ విషయమై ఇద్దరూ చాలాసార్లు గొడవపడ్డారు. ఈ క్రమంలోనే ఆమెను నిందితుడు నవ్యను హత్య చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు నిందితుడు ప్రశాంత్ ను విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Show comments