NTV Telugu Site icon

Kharge letter to Modi: ప్రధాని మోదీకి లేఖ మల్లికార్జున్ ఖర్గే.. కుల గణనకు డిమాండ్

Kharge And Modi

Kharge And Modi

దేశంలో 2021 జనాభా లెక్కలను త్వరగా నిర్వహించాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రధానిని డిమాండ్ చేశారు. జనాభా గణనలో కులాన్ని అంతర్భాగంగా చేయాలని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. 2011 కుల ప్రాతిపదికన జనాభా లెక్కలను బహిరంగపరచాలని పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కర్ణాటకలో ఎన్నికల సందర్భంగా జరిగిన ర్యాలీలో ప్రధానిని కోరిన తర్వాత ఖర్గే లేఖ రాయడంతో ప్రాధాన్యత ఏర్పడింది.

Also Read:Atiq Ahmed’s Killers: మరో జైలుకు గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ హంతకులు
కుల ప్రాతిపదికన జనాభా గణన నిర్వహించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు తన లేఖలో ప్రధానికి విజ్ఞప్తి చేశారు. దీనివల్ల సామాజిక న్యాయం, సాధికారత బలోపేతం అవుతుందన్నారు. కుల ప్రాతిపదికన జనాభా గణనను మరోసారి డిమాండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకుల తరపున నేను మీకు లేఖ రాస్తున్నాను అని ప్రధానికి రాసిన లేఖలో కాంగ్రెస్ అధ్యక్షుడు పేర్కొన్నారు.
పార్లమెంటు ఉభయ సభల్లో తాను, తన సహచరులు ఈ డిమాండ్‌ను చాలాసార్లు లేవనెత్తామని ఖర్గే గుర్తు చేశాఉ. పలువురు ఇతర ప్రతిపక్ష నేతలు కూడా ఈ విషయాన్ని డిమాండ్ చేశారని ఖర్గే చెప్పారు.

యుపిఎ ప్రభుత్వం 2011-12లో మొదటిసారిగా 25 కోట్ల కుటుంబాలకు సామాజిక-ఆర్థిక మరియు కుల గణన (SECC) నిర్వహించిందని తెలిపారు. అయితే, అనేక కారణాల వల్ల కుల డేటాను ప్రచురించలేకపోయిందన్నారు. మే 2014లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని విడుదల చేయాలని ఇతర ఎంపీలు డిమాండ్ చేశారని కాంగ్రెస్ చీఫ్ అన్నారు. ఈ జనాభా గణన కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని ఆయన అన్నారు.సాధారణంగా దశాబ్ధం తర్వాత జనాభా గణనను 2021లో నిర్వహించాల్సి ఉందని తెలిపారు. కానీ అది ఇంకా నిర్వహించలేదన్నారు. దానిని వెంటనే పూర్తి చేయాలని, సమగ్ర కుల గణనను దాని అంతర్భాగంగా చేయాలని ఖర్గే మోడీని కోరారు.

Also Read:SSC Paper Leak : పదో తరగతి హిందీ ప్రశ్నా పత్రం లీక్‌ కేసులో కీలక పరిణామం
కాగా, కర్ణాటకలోని కోలార్ ర్యాలీలో రాహుల్ గాంధీ ఆదివారం నాడు ప్రధాని మోదీని 2011 కుల ఆధారిత జనాభా గణాంకాలను బహిరంగపరచాలని కోరారు. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఓబీసీలు, దళితులు, ఆదివాసీల శాతాన్ని దేశ ప్రజలకు తెలియజేయాలని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఎంతమంది ఓబీసీలు, దళితులు, గిరిజనులు ఉన్నారో దేశానికి తెలియజేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.