యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్‌స్టార్ మహేష్‌బాబు కలిసి మరోసారి ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతున్నారు. గతంలో భరత్ అనే నేను ప్రీరిలీజ్ ఈవెంట్ ద్వారా అభిమానులను వీరు అలరించారు. తాజాగా జెమినీటీవీలో ప్రసారమవుతున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో వీరిద్దరూ కలిసి సందడి చేయనున్నారు. ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఈ షోలో మహేష్‌బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎపిసోడ్ అతి త్వరలోనే ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్ ఈనెల 5న ఆదివారం రాత్రి 8:30 గంటలకు టెలీకాస్ట్ చేయనున్నట్లు జెమినీటీవీ ప్రకటించింది. ఈ ఎపిసోడ్‌ను ‘పూనకాల ఎపిసోడ్’గా గతంలోనే నిర్వాహకులు పేర్కొన్నారు.
Read Also: 30 దేశాలను తాకిన ఒమిక్రాన్.. యూతే టార్గెట్..!
ఎన్టీఆర్, మహేష్ ఇద్దరూ ఈ షోలో గేమ్ ఆడుతూ ఎన్నెన్నో విషయాలు, అనుభూతులను పంచుకున్నట్లు తెలుస్తోంది. ఆ విషయాలు ప్రేక్షకులకు మరింత థ్రిల్లింగ్‌గా ఉంటాయట. ఈ ఇద్దరి స్పెషల్ ఎపిసోడ్ చూసి ఇద్దరు హీరోల అభిమానులు ఆనందంలో మునిగిపోవడం ఖాయమని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఈ షోలో మహేష్ బాబు ఓ ప్రశ్నకు తడబడటంతో వీడియో కాల్ ఆప్షన్‌ను ఉపయోగించుకోవడం ద్వారా పవన్ కళ్యాణ్ గేమ్‌లో పాల్గొన్నారని ప్రచారం జరుగుతోంది. మరి ఇది నిజమో లేదో తెలుసుకోవాలంటే ఈ ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే. కాగా ఈ షోలో మహేష్ రూ.25 లక్షలు గెలుచుకున్నాడని సమాచారం.
