Site icon NTV Telugu

ఒమిక్రాన్ ఎఫెక్ట్‌.. మ‌హారాష్ట్రలో 144 సెక్ష‌న్ అమ‌లు

మన దేశంలో కూడా ఒమిక్రాన్‌ వేరియంట్‌ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కమ్యూనిటీ ట్రాన్సిమిషన్‌ ప్రారంభమైపోయిందని నిపుణులు అభిప్రయాపడుతున్నారు. ఒమిక్రాన్‌ భయాల కారణంగా మహారాష్ట్ర సర్కార్‌ పలు ఆంక్షలు విధించింది. ఇప్పటి వరకు దేశంలో 32 మందికి ఒమిక్రాన్‌ వేరియంట్‌ వల్ల కరోనా సోకింది.

అయితే, ఇందులో సగం మంది బాధితులు మహారాష్ట్రలోనే ఉన్నారు. మ‌హారాష్ట్రలో ఇప్ప‌టి వ‌ర‌కు 17 ఒమిక్రాన్ కేసులు న‌మోద‌య్యాయి. నిన్న ఒక్క రోజే.. మ‌హా రాష్ట్రలో ఏకంగా.. 7 కొత్త ఒమిక్రాన్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఆ రాష్ట్ర స‌ర్కార్ అప్ర‌మ‌త్తం అయింది. దీంతో డిసెంబ‌ర్ 11 వ తేదీ మ‌రియు 12 వ తేదీల్లో ముంబై లో 144 సెక్ష‌న్ విధించింది స‌ర్కార్‌. దీంతో ర్యాలీలు, ఊరేగింపులు, గుంపులు గా ఉండ‌టం నిషేధించ‌బ‌డ్డాయి.

Exit mobile version