Site icon NTV Telugu

France: పార్లమెంట్‌ను రద్దు చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు.. ఎన్నికలకు పిలుపు

Jee

Jee

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. స్నాప్‌ ఎలక్షన్స్‌కు మేక్రాన్‌ పిలుపునిచ్చారు. తాజాగా జరిగిన ఐరోపా యూనియన్ ఎన్నికల్లో విపక్ష పార్టీ నేషనల్ ర్యాలీకి సానుకూలత వ్యక్తమైన తరుణంలో మేక్రాన్‌ ఈ ప్రకటన చేశారు.

ఇది కూడా చదవండి: Canada: భారతీయుడి హత్య.. దర్యాప్తులో తేలిందిదే!

గడువు కంటే ముందుగా నిర్వహించే ఎన్నికలనే స్నాప్ ఎలక్షన్స్‌ అంటారు. ముందస్తు ప్రకటనలు లేకుండానే, పూర్తిస్థాయి పదవీకాలం ముగియకముందే వీటిని నిర్వహించే వీలు ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా పలు అధికార పార్టీలు తమ వ్యూహాల్లో భాగంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంటాయి. తమకు అనుకూలంగా ఉన్న పరిస్థితుల నుంచి లబ్ధి పొందేందుకు, ఏదైనా ప్రతిష్టంభన నెలకొన్నప్పుడు దాని పరిష్కారం కోసం ఈ దిశగా అడుగులు వేస్తుంటాయి. ప్రస్తుతం మేక్రాన్ ప్రకటనకు గతవారం జరిగిన ఐరోపా యూనియన్ ఎన్నికలు కారణంగా తెలుస్తోంది. ఆ ఎన్నికల ఫలితాలు విపక్ష పార్టీ నేషనల్ ర్యాలీకి అనుకూలంగా ఉంటాయని ఎగ్జిట్‌ పోల్స్ అంచనాలు వెల్లడించాయి. మేక్రాన్ పార్టీ రినైజన్స్‌కు 14.8 శాతం నుంచి 15.2 శాతం ఓట్లు రావొచ్చని పేర్కొన్నాయి. ప్రతిపక్ష పార్టీకి మాత్రం 32 నుంచి 33 శాతం మధ్య ఓట్లు వస్తాయని అంచనా వేశాయి. 2027లో తన పదవీకాలం ముగిసేవరకు వేచి చూస్తే.. ఆ పార్టీ మరింత పట్టు సాధిస్తుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Modi 3.0 : కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌లను వరించిన పదవులు ఇవే..!

Exit mobile version