Canada: భారతీయుడి హత్య.. దర్యాప్తులో తేలిందిదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కెనడాలో నివసిస్తున్న ఇండియన్ యువరాజ్ గోయల్ (28) హత్యకు గురయ్యాడు. కొందరు దుండగులు ఆయనపై కాల్పులు జరపడంతో ప్రాణాలు కోల్పోయాడు. జూన్ 7న ఈ ఘటన జరిగినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే ఇది పక్కాప్లాన్‌తో ఈ ఘటన జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Amol Kale: ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు హఠాన్మరణం
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
యువరాజ్ గోయల్ పంజాబ్‌లోని లుథియానా ప్రాంతం. ఉన్నత చదువులు నిమిత్తం 2019లో గోయల్ కెనడా వెళ్లాడు. ప్రస్తుతం సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల కెనడాలో శాశ్వత నివాస హోదా కూడా లభించింది. ఈ క్రమంలోనే శుక్రవారం బ్రిటిష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో కాల్పులు జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. వారు అక్కడికి చేరుకొని యువరాజ్ మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనలో నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మృతుడికి ఎలాంటి నేర చరిత్ర లేదని వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్గానికి తరలించారు. అయితే ఈ ఘటన పక్కా ప్రణాళికతో కాల్పులకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: Austrian airlines: గగనతలంలో భారీ వడగండ్లు.. దెబ్బతిన్న విమానం ముక్కు
జూన్ 7న ఉదయం 8:46 గంటలకు 164 స్ట్రీట్‌లోని 900 బ్లాక్‌లో ఈ ఘటన జరిగింది. గోయల్ తండ్రి రాజేష్ గోయల్ కట్టెల వ్యాపారం చేస్తుంటాడు. తల్లి శకున్ గోయల్ గృహిణి. ఈ హత్యకు సంబంధించి నలుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. మన్వీర్ బస్రామ్ (23), సాహిబ్ బస్రా (20), హర్కీరత్ జుట్టి (23), అంటారియోకు కైలాన్ ఫ్రాంకోయిస్ (20)గా గుర్తించారు. ఒక లక్ష్యంతోనే చంపినట్లుగా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
ఇది కూడా చదవండి: Kalki 2898 AD Trailer : గూజ్ బంప్స్ తెప్పిస్తున్న కల్కి ట్రైలర్.. చూశారా?
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!