NTV Telugu Site icon

ఫ‌లించ‌ని ఉద్యోగం వేట‌… ఛాయ్ దుకాణంతో నెర‌వేరిన క‌ల‌…

ఆమె పీజీ చ‌దివింది.  ఉద్యోగం కోసం అనేక ప్ర‌య‌త్నాలు చేసింది.  అయిన‌ప్ప‌టికీ ఆమె ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు.  పైగా క‌రోనా మ‌హ‌మ్మారి దేశంలో విజృంభించ‌డంతో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. కొత్త వారికి అవ‌కాశాలు రావాలంటే క‌ష్ట‌మే.  దీంతో ఆ యువ‌తి కొత్త‌గా ఆలోచించింది.  త‌న ఆలోచ‌న‌ల‌ను త‌ల్లిదండ్రుల‌తో పంచుకుంది.  పీజి చ‌దివి ఆ ప‌నిచేస్తావా అంటూ నిరాశ ప‌రిచారు.  అయినా ఆ యువ‌తి వెన‌క‌డుగు వేయ‌లేదు.  అనుకున్న విధంగా త‌న ప్లాన్‌ను అమ‌లుచేసింది.  

Read: క్రిప్టో క‌రెన్సీని రూపొందించిన వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

ప‌శ్చిమ బెంగాల్‌లోని ఉత్త‌ర 24 ప‌ర‌గ‌ణాలోని హెబ్రా రైల్వే స్టేష‌న్ ద‌గ్గ‌ర ఓ చిన్న షాప్‌ను అద్దెకు తీసుకొని టీ స్టాల్‌ను ఏర్పాటు చేసింది.  న‌వంబ‌ర్ 1 వ తేదీన ఆ దుకాణాన్ని ఓపెన్ చేసింది.  మొద‌టిరోజున వ‌చ్చిన క‌స్ట‌మర్ల‌కు టీ ఫ్రీగా ఇచ్చింది.  అంతేకాదు, ఆమె టీస్టాల్ పేరు ఆక‌ట్టుకునే విధంగా మా ఇంగ్లీష్ ఛాయ్‌వాలా పేరును పెట్టింది. ఆ ఛాయ్ దుకాణం ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకుంటోంది.  హెబ్రా రైల్వే స్టేష‌న్‌కు వెళ్లే వారంతా అక్క‌డ ఆగి ఛాయ్ తాగి వెళ్తున్నార‌ట‌.  దీంతో ఈ ఛాయ్ దుకాణం ఫేమ‌స్ అయింది.  ఉద్యోగం వేట‌లో ఫెయిల్ అయినా సంపాదించాల‌నే క‌ల‌ను ఛాయ్ దుకాణంతో నెర‌వేర్చుకున్నాన‌ని చెబుతోంది తుక్‌తుకీదాస్‌.