NTV Telugu Site icon

తూ.గో. జిల్లాలో ఓ ప్రియుడి ఆవేదన.. ఐయామ్ వెరీ సారీ అంటూ…

తూ.గో. జిల్లా రాజమండ్రిలో ఓ ప్రియుడి ఆవేదన చూస్తే ఎవరికైనా జాలి కలగక మానదు. అతడి బాధను చూస్తే ఈ రోజుల్లో కూడా ఇలాంటి సెన్సిటివ్ మనుషులు ఉన్నారా అనిపిస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. ఏమైందో ఏమో తెలియదు కానీ ఓ ప్రేమజంట మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఓ ప్రేయసి తన ప్రియుడిని దూరం పెట్టింది. ఈ విరహాన్ని తట్టుకోలేని ప్రేమికుడు తన ప్రేయసి మనసు మార్చడం కోసం, తన తప్పును క్షమించమని అడగడం కోసం వినూత్న దారిని ఎంచుకున్నాడు.

Read Also: 300 మంది వాలంటీర్ల‌తో న‌గ్నంగా ఫొటోలు

ప్రేయసిని క్షమించమని వేడుకుంటూ రాజమండ్రి టౌన్‌ను పోస్టర్లతో నింపేశాడు. సిటీలో ఎక్కడ చూసినా ఆ పోస్టర్లను అంటించేశాడు. సదరు పోస్టర్లలో ఐయామ్ వెరీ సారీ అంటూ.. తాను ఎలాంటి మోసం చేయలేదంటూ సదరు యువకుడు పేర్కొన్నాడు. దీంతో ఆ ప్రియుడి పోస్టర్లు ఇప్పుడు రాజమండ్రి మొత్తం హాట్ టాపిక్‌గా మారాయి. ప్రియుడి వివరాలు తెలియకపోయినా ఈ పోస్టర్లను చూసిన ప్రజలు.. అయ్యో పాపం అంటూ యువకుడికి మద్దతు పలుకుతున్నారు.