ఆసియాలోనే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలపై చైనా కన్నేసింది. చైనా బెల్ట్ రోడ్ ప్రాజెక్ట్ పేరుతో వివిధ దేశాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతూ ఆయా దేశాలను రుణదేశాలుగా మారుస్తున్నది. ఆఫ్రికాలోని అనేక దేశాలను చైనా ఈ విధంగానే లోబరుచుకున్నది. చైనా ఆగడాలకు చెక్ పెట్టేందుకు యూరోపియన్ దేశాల సమాఖ్య 300 బిలియన్ డాలర్లతో గ్లోబల్ గేట్‌వే ను ప్రకటించింది. ఇది చైనా మాదిరిగా చీకటి ఒప్పందాలు ఉండవని, దేశాలను అప్పులు ఊబిలోకి నెట్టడం జరగదని, చిన్న దేశాల అభివృద్దికి గ్లోబల్ గేట్‌వే కృషి చేస్తుందని ప్రకటించింది ఐరోపా సమాఖ్య.
Read: ఇండియా వైపు మైక్రోసాఫ్ట్ చూపులు… భారీగా పెట్టుబడులు…
మొదట దీనిని చైనా స్వాగతించింది. ఎప్పుడైతే గ్లోబల్ గేట్‌వేకు సంబందించిన పత్రాలు బహిర్గతం అయ్యాయో అప్పుడే చైనా తన అహాన్ని బయటపెట్టింది. బీఆర్ఐతో పెట్టుకుంటే ఐరోపా 300 బిలియన్ డాలర్లు మునిగిపోవడం ఖాయమని ప్రకటించింది. అయితే చైనా బెదిరింపులకు తాము లోంగేది లేదని యూరోపియన్ సమాఖ్యలో సభ్యదేశమైన లిథువేనియా ప్రకటించింది. అంతేకాదు 2012లో చైనా ఏర్పాటు చేసిన 17+1 సమాఖ్య నుంచి బయటకు వచ్చింది. ఇక్కడితో ఆగకుండా తైవాన్ దేశానికి బహిరంగంగా సపోర్ట్ చేయడమే కాకుండా, తమ దేశంలో తైవాన్ కార్యాలయం ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. నవంబర్ 18 వ తేదీన లిథువేనియా రాజధాని విల్నియస్‌లో తైవాన్ ప్రతినిథుల కార్యాలయం ప్రారంభించారు. ఇక నవంబర్ 29 వ తేదీన తైవాన్‌లో జరిగిన ఒపెన్ పార్లమెంట్ ఫోరం సమావేశంలో లిథువేనియా సభ్యులు కూడా పాల్గొన్నారు. లిథువేనియా నాటోలో సభ్యదేశం పైగా యూరోపియన్ దేశాల సమాఖ్యలో కూడా సభ్యత్వం ఉండటంతో చైనా ఏమీ చేయలేకపోతున్నది. ఇక ఇదిలా ఉంటే డిసెంబర్ 9 వ తేదీన అమెరికాలో ప్రజాస్వామ్య సభ్యదేశాల సదస్సు జరుగుతున్నది. ఈ సదస్సుకు చైనాను ఆహ్వానించకుండా తైవాన్‌కు మాత్రమే అమెరికా ఆహ్వానం పంపడంతో డ్రాగన్ ఆగ్రహంతో రగిలిపోతున్నది. తైవాన్‌ను సొంతం చేసుకోవాలని చూస్తున్న చైనాకు ఇది మింగుడుపడని అంశంగా చెప్పాలి.
