రేపు హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనం జరగబోతున్నది. ఈ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే గణపయ్యలను నిమజ్జనం చేసేందుకు ట్యాంక్‌బండ్‌పై భారీ క్రేన్లను ఏర్పాటు చేసింది. ఇక గణేష్ నిమజ్జనం సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను డైవర్ట్ చేశారు. శనివారం అర్థరాత్రి నుంచి నగరంలో అంతర్రాష్ట్ర, జిల్లాల నుంచి వచ్చే లారీలపై నిషేదం అమలుచేశారు. అంతేకాకుండా, ఆర్టీసీ బస్సులను రూట్‌లను మళ్లిస్తున్నట్టు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. అదేవిధంగా నిమజ్జనం సందర్భంగా రేపు నగరంలో మద్యం షాపులను మూసి ఉంచాలని పోలీసులు ఆదేశాలు జారీచేశారు. జీహెచ్ఎంసీ పరిథిలోని మూడు కమీషనరేట్ పరిధిలో మద్యం, కల్లు దుకాణాలు, పబ్‌లు, బార్‌లు మూసి ఉంచాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. రేపు ఉదయం 9 గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసి ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు.
Read: వెస్ట్‌బెంగాల్‌లో బీజేపీకి షాక్: టీఎంసీలో చేరిన మాజీ కేంద్ర మంత్రి…