NTV Telugu Site icon

వైర‌ల్‌: నీటి కుంట‌లో ఒక‌వైపు మ‌నిషి… మ‌రోవైపు సింహం…

సింహాన్ని దూరం నుంచి చూస్తేనే భ‌య‌ప‌డిపోతాం.  అలాంటిది ద‌గ్గ‌ర‌గా నిల‌బ‌డి చూడాలంటే ఇంకేమైనా ఉందా చెప్పండి.  ఖ‌చ్చితంగా గుండే ఆగిపోతుంది.  ఇలానే ఓ వ్య‌క్తి ఓ మ‌డుగులోకి దిగి నీళ్ళల్లో న‌డుచుకుంటూ వెళ్తున్నాడు.  ఇంత‌లో ఎదురుగా ఓ సింహం వ‌చ్చి నిల‌బ‌డింది.  ఆ సింహన్ని చూసి ఆ వ్య‌క్తి నీళ్ల‌ల్లోనే అలానే నిల‌బ‌డిపోయాడు.  

కాసేప‌టి త‌రువాత ఆ వ్య‌క్తి ముందుకు వ‌చ్చాడు.  అంతే సింహం అమాంతంగా ముందుకు దూకి రెండుకాళ్లు అత‌ని భుజాల‌పై వేసి ముఖంపై ముద్దులు పెట్టింది.  అ వ్య‌క్తి కూడా ప్రేమ‌తో సింహాన్ని నిమిరాడు.  కొన్నేళ్ల క్రితం ఆప‌దలో ఉన్న సింహాన్ని ఆ వ్య‌క్తి ర‌క్షించి సంర‌క్షించాడు.ప్రేమ‌గా చూసుకున్నాడు.ప్రేమ‌, ఆప్యాయ‌త‌ల‌ను చూపిస్తే కౄర‌మృగాలైనా పెంపుడు జంతువుల్లా మారిపోతాయని చెప్ప‌ డంలో ఎలాంటి సందేహం అవ‌స‌రం లేదు.

Read: మ‌హారాష్ట్ర‌లో మ‌రో రెండు ఒమిక్రాన్ కేసులు…