NTV Telugu Site icon

వైర‌ల్‌: గేటుదూకి పెట్ డాగ్‌ను ఎత్తుకెళ్లిన చిరుత‌…

క‌రోనా మ‌హ‌మ్మారి లాక్ డౌన్ కాలంలో వన్య‌మృగాలు, వ‌న్య‌ప్రాణులు జ‌నావాసాల్లోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.  రోడ్ల‌న్నీ ఖాళీగా మారిపోవ‌డంతో వ‌న్య‌మృగాలు జ‌నావాసాల్లోకి వ‌చ్చాయి.  ఆ త‌రువాత లాక్ డౌన్ ఎత్తివేయ‌డంతో జ‌నాల ర‌ద్దీ పెరిగింది.  దీంతో వ‌న్య‌మృగాలు జ‌నావాసాల్లోకి రావ‌డం త‌గ్గిపోయింది. అడవికి ద‌గ్గ‌ర‌గా ఉన్న గ్రామాల్లోకి చిరుత‌లు వ‌చ్చి భ‌య‌పెడుతున్నాయి.  ఓ ఇంట్లోని పెంపుడు శున‌కం గేటు ముందు నిల‌బ‌డి పెద్ద‌పెద్ద‌గా మొరుగుతున్న‌ది.  రాత్రి వేళ కావ‌డంతో ఎవ‌రూ దానిని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు.  

Read: ఆ షో భ‌విష్య‌త్తు ప్ర‌శ్నార్థ‌కం: గూగుల్‌, ఫేస్‌బుక్ బాట‌లో మైక్రోసాఫ్ట్ కూడా…

అలా మొరుగుతున్న ఆ కుక్క స‌డెన్‌గా అక్క‌డి నుంచి ప‌రుగులు తీసింది.  వెంట‌నే ఓ చిరుత వీధి గేటు దూకి లొనికి వ‌చ్చి చిరుత‌ను నోట కరుచుకొని వ‌చ్చిన దారిన వెళ్లిపోయింది.  దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ‌య్యాయి.  ఈ వీడియోను ప‌ర్విన్ క‌స్వాన్ ట్విట్ట‌ర్‌లో షేర్ చేశాడు.  జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించాడు.  ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.  దీంతో చాలా మంది త‌మ పెంపుడు జంతువుల మెడ‌కు ప‌దునైన ముళ్లు క‌లిగిన బెల్టులు త‌గిలిస్తున్నారు.