ChatGPT: ప్రజలు ఏ రంగంలో పని చేసినా వారు తమ జీతం భారీగా ఉండాలని కోరుకుంటారు. అంతేకాకుండా ఇప్పుడున్న టెక్నాలజికి తగ్గట్టుగా తమ పిల్లలకు మంచి ప్యాకేజ్ వచ్చేలా చదువులు చదివిపిస్తున్నారు. ఇప్పుడున్నది టెక్నాలజీ యుగం.. మన చుట్టూ ఉన్న విషయాలు వేగంగా మారుతున్నాయి. అందుకు తగ్గట్టుగా మనం కూడా ఆలోచించుకోవాలి. ప్రస్తుతం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇందులో ChatGPT బాగా పాపులర్ అవుతోంది. ChatGPT గత ఏడాది నవంబర్‌లో మాత్రమే ప్రారంభించబడినప్పటికీ.. ఇది వేగంగా ప్రజాదరణ పొందుతుంది.
Read Also: Rudrangi Trailer: జగ్గు భాయ్.. విలనిజంతోనే భయపెట్టి చంపేసేలా ఉన్నాడు
మొత్తం మీద మీరు ముందుకు సాగాలంటే.. మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను కూడా అర్థం చేసుకోవాలి. ఇది చాలా వేగంగా జనాదరణ పొందడంతో పాటు.. వృత్తిగా బలపడుతోంది. మీకు మెషిన్ లెర్నింగ్‌పై అవగాహన ఉంటే.. ChatGPT వంటి AI సాధనాలను ఎలా అమలు చేయాలో తెలిస్తే కోట్ల విలువైన ప్యాకేజీలు మీ కోసం వేచి ఉన్నాయి. AI టూల్స్‌పై పట్టు సాధించిన నిపుణులకు కోట్లలో ప్యాకేజీలు అందిస్తున్న కంపెనీలు చాలానే ఉన్నాయి. ఒక అధ్యయనం ప్రకారం.. ఉద్యోగ ఖాళీలు ఉన్న చోట, 91 శాతం కంపెనీలు ChatGPTని అమలు చేసే నిపుణులను నియమించుకోవాలనుకుంటున్నాయి. ఇది కంపెనీ సమయాన్ని ఆదా చేయడమే కాకుండా ఉత్పాదకత మరియు పనితీరును మెరుగుపరుస్తుందని వారు భావిస్తున్నారు.
Read Also: Noodles Omelette : పిల్లలు ఇష్టంగా తినే నూడిల్స్ ఆమ్లెట్ ను ఎలా తయారు చెయ్యాలంటే?
AI కోసం కోట్ల విలువైన ప్యాకేజీలు ఉన్నాయి. మీడియా నివేదికల ప్రకారం.. ఆన్‌లైన్ జాబ్ ప్లాట్‌ఫామ్ లింక్డ్‌ఇన్‌లో కంపెనీలు చాట్‌జిపిటి నిపుణులకు సంవత్సరానికి రూ. 1.5 కోట్ల వరకు ప్యాకేజీలను అందిస్తున్నాయి. ChatGPT మరియు మిడ్‌జర్నీ వంటి విభిన్న AI ప్లాట్‌ఫారమ్‌ల నుండి అనుభవజ్ఞులైన వ్యక్తుల కోసం గొప్ప ఆఫర్‌లు ఉన్నాయి. ఈ ఏడాది మార్చిలో ఒక అమెరికన్ స్టార్టప్ ప్రాంప్ట్ ఇంజనీర్ మరియు లైబ్రేరియన్ పోస్టుల కోసం సంవత్సరానికి సుమారు రూ. 2.7 కోట్లను ఆఫర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. మీరు కూడా మెరుగైన కెరీర్ కోసం చూస్తున్నట్లయితే కృత్రిమ మేధస్సు అనేది అభివృద్ధి చెందుతున్న రంగం. అయితే AI రాకతో ఉద్యోగాలు నిలిచిపోతాయని చెబుతున్నారు. అయితే ఉద్యోగాలు ముగుస్తాయా లేదా అనేది వేరే విషయం కానీ.. AI నిపుణులకు మంచి భవిష్యత్ ఉంది.