తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. బ్రిటన్‌లో జరుగుతున్న ‘ఐడియాస్ ఫర్ ఇండియా’ సదస్సులో మాట్లాడాల్సిందిగా కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. మే 11, 12 తేదీల్లో లండన్‌లో జరగనున్న ‘ఐడియాస్ ఫర్ ఇండియా’ రెండో ఎడిషన్ సదస్సులో మాట్లాడాల్సిందిగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను గ్లోబల్ అడ్వైజరీ సంస్థ ఈపీజీ ఆహ్వానించింది. తెలంగాణ ప్రభుత్వం సాధించిన ఆర్థిక పురోగతిని ప్రదర్శించడానికి మేము ప్రత్యేకించి ఆసక్తిగా ఉన్నామని గ్లోబల్ సంస్థ తెలిపింది.
Also Read: Delhi Metro Girl: “డోంట్ కేర్”.. బికినీలో మెట్రో ప్రయాణంపై యువతి ఏం చెప్పిందంటే..
అంతేకాదు హౌస్ ఆఫ్ కామన్స్‌లో సీమా మల్హోత్రా, UK క్యాబినెట్ మంత్రితో నిర్వహించే విందుకు హాజరు కావాల్సిందిగా ఆర్థిక , వ్యూహాత్మక కన్సల్టింగ్ సంస్థ కేటీఆర్‌కి ఆహ్వానం పంపింది. యునైటెడ్ కింగ్‌డమ్ అంతటా జరగనున్న భారత వారోత్సవాల ప్రారంభోత్సవంలో భాగంగా బహుళ వ్యాపార, మీడియా, రాజకీయ నాయకులతో సహా 800 మంది వ్యక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది.