Site icon NTV Telugu

అత్యవసర సమావేశంపై కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ ప్రకటన

KRMB GRMB

KRMB GRMB

అత్యవసర బోర్డు సమావేశానికి సంబంధించి సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు.. హైదరాబాద్ లోని జలసౌధలో జీఆర్ఎంబీకి చెందిన 10వ సమావేశం, కేఆర్ఎంబీకి చెందిన 13వ అత్యవసర సమావేశం నిర్వహించినట్టు ప్రకటించాయి… కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లలోని వివిధ అంశాలను అమలు చేసేందుకు ఈ అత్యవసర సమావేశం నిర్వహించినట్టు వెల్లడించాయి బోర్డులు.. తెలంగాణ రాష్ట్రం నుంచి సభ్యులు ఎవరూ ఈ సమావేశానికి హాజరు కాలేదని వెల్లడించిన గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డులు. గెజిట్ నోటిఫికేషన్‌ను అనుసరించి బోర్డుల్లో సభ్యుల నియామకాన్ని 30 రోజుల్లోగా చేపట్టాల్సి ఉందని దీనికి సంబంధించి ఏపీ త్వరలోనే సదరు సమాచారం ఇస్తామని ప్రకటించినట్టు వెల్లడించాయి.

గెజిట్ నోటిఫికేషన్లోని కొన్ని ప్రాజెక్టుల విషయంలో మార్పు చేర్పులు ఉన్నాయని.. దీనిపై నెల రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టు ఆంధ్రప్రదేశ్‌ వెల్లడించిందని తన ప్రకటనలో పేర్కొన్నాయి రెండు బోర్డులు.. రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాల్సిన సీడ్ మనీ విషయంలో తమ ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటున్నట్టు ఏపీ సభ్యులు వెల్లడించారని.. ఉమ్మడి ప్రాజెక్టుల వద్ద సీఐఎఎస్ భద్రతా దళాల మొహరింపు అంశంపై కేంద్ర జలశక్తి శాఖ హోంశాఖలు పర్యవేక్షిస్తున్నాయని స్పష్టం చేశాయి.. కాగా, గెజిట్ నోటిఫికేషన్లోని అంశాల అమలుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సహకరించాలని స్పష్టం చేసింది కృష్ణా నది, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు ఉమ్మడి బోర్డుల సమావేశం.

Exit mobile version