NTV Telugu Site icon

కృష్ణపట్నంలో ఆందోళన… ఆనందయ్య ఆచూకీ చెప్పాలని ప్రజల డిమాండ్…

ఆనంద‌య్య మెడిసిన్‌కు రోజురోజుకు డిమాండ్ పెరుగుతున్న‌ది.  ప‌ది రోజుల క్రితం వ‌ర‌కు ఆనంద‌య్య మెడిసిన్‌ను అనేకమందికి ఉచితంగా స‌ర‌ఫ‌రా చేశారు.  అయితే, శాస్త్రీయ‌త అంశంపై ప్ర‌స్తుతం సీసీఆర్ఏఎస్ ప‌రిశోధ‌న‌లు చేస్తున్న‌ది.  గ‌త కొన్ని రోజులుగా ఆనంద‌య్య క‌నిపించ‌డం లేద‌ని, ఆయ‌న ఆచూకీ చెప్పాన‌లి, ఆనంద‌య్య‌ను వ‌దిలిపెట్టాలని కృష్ణ‌ప‌ట్నం ప్ర‌జ‌లు డిమాండ్ చేస్తున్నారు.  వారం రోజులుగా ఆనంద‌య్య ఆచూకి లేద‌ని గ్రామస్తులు ఆంధోళ‌న చేస్తున్నారు.  కృష్ణ‌ప‌ట్నం పోర్టులో ఆనంద‌య్య ఉన్నార‌నే విష‌యం తెలుసుకున్న గ్రామ‌స్తులు ఆనంద‌య్య‌ను వ‌దిలిపెట్టాల‌ని డిమాండ్ చేస్తున్నారు.  ఇక ఆనంద‌య్య త‌న మెడిసిన్ పై ఇప్ప‌టికే హైకోర్టులో పిల్ ను దాఖ‌లు చేసిన సంగతి తెల‌సిందే.  ఈ కేసు సోమ‌వారంకు హైకోర్టు వాయిదా వేసింది.