Site icon NTV Telugu

కాంగ్రెస్‌కు మరో షాక్.. కౌశిక్ రెడ్డి రాజీనామా

Koushik Reddy

Koushik Reddy

అనుకున్నదే జరిగింది కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు కౌశిక్‌ రెడ్డి.. ఆయన అధికార టీఆర్ఎస్‌ పార్టీకి దగ్గరగా ఉంటున్నారనే ప్రచారం గత కొంతకాలంగా సాగుతుండగా.. తాజాగా లీక్‌అయిన ఆడియో టేపులు కలకలం సృష్టించాయి.. హుజురాబాద్‌లో టీఆర్ఎస్ టికెట్ తనకే వస్తుందంటూ ఆయనే స్వయంగా చెప్పడం సంచలనంగా మారింది.. ఈ వ్యవహారంపై సీరియస్‌ అయిన టీపీసీసీ క్రమశిక్షణా సంఘం.. కౌశిక్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసి.. సమాధానం కోసం 24 గంటల డెడ్‌లైన్‌ పెట్టింది.. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు కౌశిక్‌రెడ్డి.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ కొత్త చీఫ్ రేవంత్‌రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు కౌశిక్‌ రెడ్డి.

Exit mobile version