Site icon NTV Telugu

అధికారిక లాంఛనాలతో రోశయ్య అంత్యక్రియలు, 3 రోజులు సంతాప దినాలు

సీనియర్‌ పొలిటీషన్‌, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి రోశయ్య కన్నుమూయడంతో.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది… ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించిన సర్కార్.. అదే విధంగా.. మూడు రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించింది. ఈ నెల 4, 5, 6 తేదీల్లో సంతాప దినాలుగా పాటించాలని నిర్ణయించంది… ఇక, రేపు మధ్యాహ్నం హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో రోశయ్య అంత్యక్రియలను నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు.. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాల్సిందిగా.. రంగారెడ్డి, హైదారబాద్‌ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌. ఇక, రోశయ్య భౌతికకాయాన్ని ఇప్పటికే ఆయన నివాసానికి తరలించారు.. రేపు ఉదయం వరకు నివాసంలోనే పార్థివదేహం ఉండనుండగా.. రేపు ఉదయం 9.30 గంటలకు గాంధీ భవన్‌కు తరలించనున్నారు.. అక్కడి నుంచి అంతమయాత్ర ప్రారంభించి.. రేపు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

https://www.youtube.com/watch?v=8QmpiSGFOpU
Exit mobile version