Site icon NTV Telugu

కోల్‌క‌తా మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో తృణ‌మూల్ క్లీన్‌స్వీప్‌…

ఇటీవ‌లే కోల్‌క‌తా మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌కు ఎన్నిక‌లు జ‌రగాయి.  ఈ ఎన్నిక‌ల‌కు సంబంధించి కౌంటింగ్ ఉద‌యం నుంచి ప్రారంభమైంది.  ఉద‌యం నుంచి ఫ‌లితాలు తృణ‌మూల్ కాంగ్రెస్‌కు అనుకూలంగా వ‌స్తున్నాయి.  144 వార్డులున్న కోల్‌క‌తా కార్పొరేష‌న్‌లో తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ 7 చోట్ల విజ‌యం సాధించి 114 చోట్ల లీడింగ్‌లో కొన‌సాగుతోంది.  ప్ర‌తిప‌క్షంలో ఉన్న బీజేపీ కేవ‌లం 4 చోట్ల మాత్రమే లీడింగ్‌లో ఉన్న‌ది.  కాంగ్రెస్‌, వామ‌ప‌క్షాలు త‌లా రెండు చోట్ల లీడింగ్‌లో కొన‌సాగుతున్నారు.  

Read: వైర‌ల్‌: నెటిజన్ల మ‌న‌సు దోచిన దున్న‌పోతు…

ఇండిపెండెంట్లు మూడు చోట్ల లీడింగ్‌లో కొన‌సాగుతున్నారు.  అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తృణ‌మూల్‌కు గ‌ట్టి పోటీ ఇచ్చిన బీజేపీ, కోల్‌క‌తా మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో రాణించ‌లేక‌పోయింది.  కోల్‌క‌తాలో త‌న పట్టును మ‌రోసారి నిల‌బెట్టుకుంది తృణ‌మూల్‌.  దేశ‌వ్యాప్తంగా బీజేపీకి వీస్తున్న ఎదురుగాలి తృణ‌మూల్‌కు క‌లిసివ‌చ్చింద‌ని చెప్పాలి. 

Exit mobile version