ఐపీఎల్-2022 కోసం రిటైనింగ్ ప్రక్రియ ముగిసింది. స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్‌ను వారి జట్లు రిటైన్ చేసుకోలేదు. అయితే వారిని రిటైన్ చేసుకోకపోవడానికి ఓ కారణముందని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఐపీఎల్‌లో అహ్మదాబాద్, లక్నో జట్లు రంగప్రవేశం చేయబోతున్నాయి. ఈ నేపథ్యంలో లక్నో ఫ్రాంచైజీ ఇద్దరు ఆటగాళ్లను సంప్రదించడం వారికి ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Also: IPL 2022 : ఎక్కువ ధర పలికన ఆటగాళ్లు వీళ్లే !
సన్‌రైజర్స్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్, పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను లక్నో ఫ్రాంచైజీ సంప్రదించాయన్న వార్తలతో ఆయా ఫ్రాంఛైజీలు వారిని రిటైన్ చేసుకోలేదు. లక్నో ఫ్రాంచైజీ తమ ఆటగాళ్లను సంప్రదించిన విషయంపై ఆయా ఫ్రాంచైజీలు బీసీసీఐకి మౌఖికంగా ఫిర్యాదు చేశాయని తెలుస్తోంది. అయితే ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒక ఫ్రాంచైజీలో కాంట్రాక్టు ప్రకారం కొనసాగుతున్న ఆటగాళ్లను మరో ఫ్రాంచైజీ సంప్రదించకూడదు. గతంలో రవీంద్ర జడేజా ఇలాంటి కారణంగానే ఏడాది పాటు నిషేధానికి గురయ్యాడు. 2008, 2009 సీజన్‌లలో ఆల్‌రౌండర్‌గా రాణించిన జడేజాను మరో ఫ్రాంచైజీ సంప్రదించడంతో 2010లో అతడిపై బీసీసీఐ వేటు వేసింది. తాజాగా పంజాబ్ ఆటగాడు కేఎల్ రాహుల్, సన్‌రైజర్స్ ఆటగాడు రషీద్‌ఖాన్‌లతో లక్నో ఫ్రాంచైజీ సంప్రదింపులు జరిపిన విషయం నిజమని తేలితే వీళ్లిద్దరిపైనా ఏడాది పాటు వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
