Site icon NTV Telugu

పేరు మార్చుకున్న కియా మోటార్స్… కొత్త పేరు ఏమంటే… 

ద‌క్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్ సంస్థ ఇండియాలోని అనంత‌పురం జిల్లాలో ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్లాంట్ నుంచి కియా కార్ల‌ను ఉత్ప‌త్తి చేస్తున్నారు.  కియా కార్లు ఇండియాలో ఫేమ‌స్ కావ‌డంతో కియా మోటార్స్ సంస్థ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.  ఇండియాలో కియా మోటార్స్ సంస్థ పేరును మార్చుకుంది. కియా మోటార్స్ ను కియా ఇండియాగా మార్చింది.  లోగోలో కూడా ఈ మార్పులు చేసింది. ఇండియాలో ఉన్న డిస్ట్రిబ్యూట‌ర్ల వ‌ద్ద కూడా క్ర‌మ‌ప‌ద్ద‌తిలో పేరును మార్పు చేస్తున్న‌ది.  కొన్ని రోజుల్లో ఈ ప్ర‌క్రియ పూర్త‌వుతుంద‌ని కిమా సంస్థ పేర్కోన్న‌ది.  కార్ల అమ్మ‌కాల్లో కియా సంస్థ నాలుగో స్థానంలో నిలిచింది.

Exit mobile version