NTV Telugu Site icon

ఆదర్శంగా నిలుస్తున్న అడిషనల్ కలెక్టర్.. సర్కారు దవాఖానాలో ప్రసవం

ప్రభుత్వ పెద్దల నుంచి సామాన్యుల వరకు అందరూ కార్పొరేట్ వైద్యానికే ప్రాధాన్యత ఇస్తున్న ప్రస్తుత రోజుల్లో ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్ స్నేహలత పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆమె నిండు గర్భిణీ కావడంతో శుక్రవారం నాడు పురిటి నొప్పులతో సామాన్య మహిళగా ఖమ్మంలోని ప్రభుత్వ దవాఖానాకు వెళ్లి టెస్టులు చేయించుకున్నారు. అనంతరం వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేసి డెలివరీ చేశారు. ఈ మేరకు శనివారం ఆమె పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలియజేశారు.

Read Also: ధరణి పోర్టల్ పురోగతిపై సీఎస్ సమీక్ష

కాగా ప్రస్తుతం అడిషనల్ కలెక్టర్ డెలివరీ న్యూస్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుండగా… అడిషనల్ కలెక్టర్ స్థాయిలో ఉండి స్నేహలత సర్కారు దవాఖానాలో డెలివరీ చేయించుకుని అందరికీ ఆదర్శంగా నిలస్తున్నారని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. స్నేహలత చేసిన పని వల్ల ప్రభుత్వాస్పత్రులపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ వనరులను ప్రభుత్వాధికారులు కూడా వినియోగించుకుని ప్రజలు కూడా వాడుకునేలా అవగాహన కల్పించాలని నెటిజన్లు కోరుతున్నారు.