కేరళకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ టైమ్ టేబుల్ సిద్ధమైంది. తిరువనంతపురం-కసర్‌కోట్ వందేభారత్ తిరువనంతపురంలో ఉదయం 5.20 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.25 గంటలకు కాసర్‌కోట్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి రాత్రి 10.35 గంటలకు తిరువనంతపురం చేరుకుంటుంది. రన్నింగ్ టైమ్ 8 గంటల 05 నిమిషాలుగా ఉంది.
Also Read:BKS vs MI : విజృంభించిన పంజాబ్ బ్యాటర్లు.. ముంబయి లక్ష్యం 215 పరుగులు
వందేభారత్‌కు షోర్నూర్‌లో స్టాప్ కల్పించారు. తిరువనంతపురం, కొల్లం, కొట్టాయం, ఎర్నాకులం టౌన్, త్రిసూర్, షోర్నూర్, కోజికోడ్, కన్నూర్, కాసర్‌గోడ్ లో వందేభారత్ రైలు ఆగుతుంది. గురువారం ఈ రైలు సర్వీసు అందుబాటులో ఉండదు. వందేభారత్‌కు వివిధ వర్గాల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో షోర్నూర్‌లో కూడా స్టాప్ కల్పించారు. ఇదిలా ఉండగా చెంగన్నూరు, తిరూర్ స్టేషన్లలో స్టాప్ ఉండదు. కాగా, తిరువనంతపురం–కసర్‌కోట్ వందేభారత్ రైలుకు 20634 నెంబర్ కేటాయించారు. కాసర్‌కోట్-తిరువనంతపురం వందేభారత్ రైలుకు 20633 నెంబర్ కేటాయించారు.
Also Read:Bhatti Vikramarka: సీఎల్పీ నేత పాదయాత్రలో అకాల వర్షం.. పరుగులు తీసిన నేతలు
కాగా, వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును షోర్నూర్‌లో స్టాప్ కల్పించాలని పాలక్కాడ్ ఎంపీ వీకే శ్రీకాంతన్ చేసిన అభ్యర్థనకు కేంద్ర రైల్వే మంత్రి అనుమతి ఇచ్చారు. పార్లమెంటులో కేరళ ఎంపీల డిమాండ్ మేరకు కేరళకు రైలు మంజూరు చేశారు. రాజకీయ లబ్ధి కోసం వందేభారత్‌ను ఉపయోగించుకోవద్దని ఎంపీ వీకే శ్రీకంఠన్ అన్నారు.
