దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో కేసుల ఉధృతి కొనసాగుతోంది. దీంతో ఆరాష్ట్రంలో మళ్లీ నైట్ కర్ఫ్యూను విధించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతున్నది. ఇక, కేరళ సరిహద్దుగా ఉన్న కర్ణాటక కీలక నిర్ణయం తీసుకున్నది. కేరళ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. కేరళ నుంచి వచ్చే ప్రయాణికులు తప్పని సరిగా సంస్థాగతంగా ఏర్పాటు చేసే క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకున్నా, రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ఏడు రోజుల క్వారంటైన్ తప్పనిసరి అని స్పష్టం చేసింది.
మళ్లీ మొదలైన ఆంక్షలు… క్వారంటైన్… ఆ రాష్ట్రం నుంచి వస్తే…
