NTV Telugu Site icon

అసెంబ్లీలో జారిన పంచే… న‌వ్వు ఆపుకోలేక‌పోయిన స్పీక‌ర్‌…

క‌ర్ణాట‌క అసెంబ్లీలో ఓ విచిత్ర‌మైన సంఘ‌ట‌న జ‌రిగింది.  మైసూర్ అత్యాచార ఘ‌ట‌న‌పై మాజీ ముఖ్య‌మంత్రి సిద్ద‌రామ‌య్య సీరియ‌స్‌గా మాట్లాడుతున్నారు.  ఆ స‌మ‌యంలో కర్ణాట‌క కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్య‌క్షుడు డికే శివ‌కుమార్ వ‌చ్చి సిద్ధ‌రామ‌య్య చెవిలో పంచె ఊడిపోయింద‌ని చెప్పాడు.  వెంట‌నే సిద్ధ‌రామ‌య్య త‌న సీట్లో కూర్చుండిపోయి త‌రువాత మాట్లాడ‌తాన‌ని అన్నారు.  అయితే, స‌మ‌స్య ఏంటో చెప్పాల‌ని సిద్ధ‌రామ‌య్య‌ను స్పీక‌ర్ బంగార‌ప్ప కోర‌గా, ధోతి బిగించి క‌ట్టుకొని, కరోనా త‌రువాత నాలుగైదు కేజీల బ‌రువు పెరిగాన‌ని, పోట్ట ప‌రిమాణం పెరిగిపోవ‌డంతో ధోతి నిల‌వ‌డంలేద‌ని అన్నారు.  సిద్ధరామ‌య్య ఇమేజ్‌ను, కాంగ్రెస్ పార్టీ ఇమేజ్‌ను శివ‌కుమార్ కాపాడేందుకు ప్ర‌య‌త్నం చేశారని, ఆ ఇమేజ్‌ను బీజేపీ నేత‌లు డ్యామేజ్ చేయ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేత ర‌మేష్ కుమార్ పేర్కొన్నారు.  త‌న ఇమేజ్‌ను ఎవ‌రూ డ్యామేజ్ చేయ‌లేర‌ని సిద్ధ‌రామ‌య్య చెప్ప‌డంతో స్పీక‌ర్ బంగార‌ప్ప న‌వ్వు ఆపుకోలేక‌పోయారు.

Read: ఆచంట‌లో జ‌న‌సేన‌తో కుదిరిన దోస్తి… టీడీపీకి ఎంపీపీ…